అబ్బో.. విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' అంట!
on Sep 17, 2019
'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ.. తన దృష్టినంతా క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్న సినిమాపై పెట్టాడు. ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ 'బ్రేకప్' అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. విజయ్ దేవరకొండను 'వరల్డ్ ఫేమస్ లవర్'గా క్రాంతి మాధవ్ నిర్ధారించేశాడు. అవును. విజయ్ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌పై కె.ఎస్. రామారావు సమర్పిస్తోన్న సినిమాకు 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీని రామారావు కుమారుడు కె.ఎ. వల్లభ నిర్మిస్తున్నాడు.
ఈ మూవీలో ఒకరిద్దరు కాకుండా.. ఏకంగా నలుగురితో ప్రేమాయణం నడిపే లవర్‌గా కనిపించనున్నాడు విజయ్. ఆ నలుగురు భామలు.. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లీటే. ఒక సెన్సిబుల్ సబ్జెక్టుతో క్రాంతి మాధవ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడనీ, ఈ మూవీకి 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా చూస్తేనే తెలుస్తుందనీ సినిమా యూనిట్ చెబుతోంది. కాగా సెప్టెంబర్ 20న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించనున్నారు.
గోపి సుందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకొన్న 'డియర్ కామ్రేడ్' నిరాశ కలిగించడంతో, 'వరల్డ్ ఫేమస్ లవర్'తో సక్సెస్ సాధించాలనే పట్టుదలతో విజయ్ ఉన్నాడు.
Also Read