'డియర్ కామ్రేడ్' పాకిస్తాన్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిందా?!
on Feb 12, 2020
"నాలుగు దేశాల్లో 'డియర్ కామ్రేడ్' నంబర్ 1 పొజిషన్ సాధించింది. నేపాల్‌లో ఆ సినిమా ఒక ఉద్వేగం. అందరూ నా పేరు బాబీని బాగా గుర్తుంచుకున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, నార్త్ ఇండియాలో నా కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్. బిగ్గెస్ట్ నంబర్స్ వచ్చాయి" అని చెప్పి మీడియా వాళ్లను ఆశ్చర్యపరిచాడు విజయ్ దేవరకొండ. దాంతో ఆశ్చర్యపోయిన ఒక రిపోర్టర్ "ఆ సినిమా పాకిస్తాన్లో రిలీజయ్యిందా?" అని ప్రశ్నిస్తే, "అహ.. యూట్యూబ్‌లో" అని జవాబిచ్చాడు విజయ్. దాంతో రిపోర్టర్లంతా ఫక్కున నవ్వేశారు. ఈ సన్నివేశం 'వరల్డ్ ఫేమస్ లవర్' ప్రమోషన్లో భాగంగా ఫిలిం జర్నలిస్టులతో విజయ్ ఇంటరాక్ట్ అయినప్పుడు చోటు చేసుకుంది.
డెబ్యూ డైరెక్టర్ భరత్ కమ్మ రూపొందించిన 'డియర్ కామ్రేడ్' సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ సాధించగా, విడుదల తర్వాత లాస్ ప్రాజెక్టుగా మారింది. అయితే ఆ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాని విజయ్ చెప్పాడు. "పూరీ గారి సినిమా షూట్ చేస్తుంటే మంబైలో అందరూ నన్ను 'బాబీ.. బాబీ' అని పిలుస్తున్నారు. అదివరకు 'అర్జున్ రెడ్డి' అని పిలిచేవాళ్లు. 'డియర్ కామ్రేడ్' అనేది ప్రేక్షకులకు నేను చెప్పాలనుకున్న కథ. సినిమాకి కరెక్ట్ రివ్యూస్ రాకపోయినా, నేనెక్కువ ఇష్టపడ్డ, నేను గర్విస్తున్న సినిమా. 'బిహైండ్‌వుడ్స్' (వెబ్సైట్) నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నా. అలాగే రష్మిక కూడా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకోవడం హ్యాపీ. అందుకు ఆమె అర్హురాలు. ఏ కారణాల చేతనో థియేటర్లలో ఆ సినిమా నడవకపోయినా, అనేక ఇతర మార్గాల్లో ఆ సినిమా ప్రజలకు రీచ్ అయ్యింది. ఆ సినిమా విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను" అని చెప్పుకొచ్చాడు విజయ్.