శ్రీదేవి కూతురికి అర్జున్‌రెడ్డి ముద్దులు...!!!
on Sep 26, 2018
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు బాలీవుడ్ లో `ధడక్` చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జాన్వి నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం జాన్వి `తఖ్త్` అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే తెలుగు, తమిళ భాషల చిత్రాల్లో కూడా నటించాలన్న ఆసక్తితో జాన్వి ఉందట. అయితే తెలుగులో విజయ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయట. సౌత్ ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు జాన్వితో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. ఇప్పటికే ఓ చిత్రం ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరో చిత్రం కూడా ఫైనల్ దశలో ఉందట. అన్ని కుదిరితే తెలుగులో విజయ దేవరకొండ సరసన జాన్వి నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.