ఎన్టీఆర్ చిత్రంలో విజయ్‌దేవరకొండ!!
on Sep 18, 2018
ఎన్టీఆర్ లైఫ్ హిస్టరీ ఆధారంగా బాలకృష్ణ టైటిల్ పాత్రలో రూపొందుతున్న చిత్రం `ఎన్టీఆర్`. ప్రస్తుతం ఈ బయోపిక్ శరశేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు క్రిష్ ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ చిత్రానికి డైరక్షన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి పలు పాత్రలకు పేరున్న హీరోలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది పేర్లు బటయటకు వస్తూ ఈ చిత్రం రోజూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన వార్తొకటి సోషల్ నెట్ వర్క్స్ లో హల్ చల్ చేస్తోంది.
అదేంటంటే... ఈ చిత్రంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కూడా చూపించనున్నాన్నారట. లేటెస్ట్ వార్తల ప్రకారం ఇప్పుడు కేసీఆర్ క్యారక్టర్ లో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ నటించబోతున్నాడట. ఆ పాత్రకు విజయ్ అయితే సరిగ్గా సూటవుతాడని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఎన్టీఆర్ కి వీరాభిమాని కేసీఆర్. ఆయన పొలిటికల్ ఎంట్రీకి కూడా కారణం ఎన్టీఆర్. అందుకే కేసీఆర్ క్యారక్టర్ కూడా ఉంటే బావుంటుందని యూనిట్ ఆలోచిచన చేసి ఆ పాత్రకు విజయ్ దేవరకొండను తీసుకుంటున్నారట. ఇప్పటికే విజయ్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా కీరవాణి సంగీత సారథ్యంలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
Also Read