విక్టరీ వెంకటేష్ సినిమాలో ఎన్టీఆర్ సినిమా..!
on May 16, 2016

స్టార్ హీరోస్ లో ఎలాంటి ఇగో ప్రాబ్లెమ్స్ లేని హీరోగా విక్టరీ వెంకటేష్ కు పేరుంది. తన సినిమాల్లో వేరే హీరోల గెటప్ ను వేయడానికి ఎప్పుడూ ఇబ్బంది పడడు వెంకీ. అలాగే కథ డిమాండ్ చేస్తే, సినిమా కోసం ఏదైనా చేయడం ఆయనకు అలవాటు. గతంలో షాడో సినిమాలో చాలా మంది హీరోల పేరడీలు చేసి మెప్పించారు కూడా. తాజాగా తన సినిమా బాబు బంగారంలో, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాను స్ఫూఫ్ చేస్తున్నారట. డైరెక్ట్ గా వెంకీ చేస్తాడా లేక కమెడియన్ తో చేయిస్తాడా అన్నది సస్పెన్స్ గా ఉన్నప్పటికీ, మారుతి ఆస్థాన కమెడియన్ సప్తగిరి చేయడానికే ఎక్కువ అవకాశం ఉందంటున్నారు సినీజనాలు. సినిమాలో ఈ సీన్స్ పడి పడి నవ్వేలా చేస్తాయట. గతంలో కూడా తన సినిమాల్లో సప్తగిరితో పేరడీలు చేయించాడు మారుతి. లవర్స్ సినిమాలో చేసిన మగథీర స్పూఫ్ బాగా పేలింది. మరి బాబు బంగారంలోని స్పూఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి. మూవీ విషయానికొస్తే, ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుని బ్యాలెన్స్ పాటల కోసం యూరప్ చెక్కేశారు మూవీ టీం. అక్కడ రెండు డ్యూయెట్స్ ను తెరకెక్కిస్తున్న బాబు బంగారం టీం వచ్చే నెలాఖరుకు మూవీని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



