Home

»

Latest News

బ‌ర్త్ డే స్పెష‌ల్ః వెంకీ బ‌ర్త్ డేకి రిలీజైన ఏకైక చిత్రం!

Dec 13, 2021

డిసెంబ‌ర్ 13.. సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేశ్ పుట్టిన‌రోజు. అంతేకాదు.. ఆయ‌న పెళ్ళిరోజు కూడా. అంత‌టి ప్ర‌త్యేక‌త ఉన్న డిసెంబ‌ర్ 13న ఇప్ప‌టివ‌ర‌కు వెంకీ న‌టించిన ఒకే ఒక సినిమా రిలీజ్ అయింది. అది కూడా క‌థానాయ‌కుడిగా వెంక‌టేశ్ కెరీర్ 33 వ‌సంతాలు పూర్త‌య్యాకే అలా జ‌ర‌గ‌డం విశేషం. ఇంత‌కీ ఆ చిత్ర‌మేమిటంటే.. `వెంకిమామ‌`. ఈ టైటిల్ ఇప్పుడు ఎంత‌గా పాపుల‌ర్ అయ్యిందంటే.. వెంక‌టేశ్ ని కాస్త వెంకిమామ అంటూ ఆప్యాయంగా ప‌ల‌క‌రించేంత‌గా.

'ఆర్ఆర్ఆర్' లోగోలో చరణ్ ఫోటో ముందు పెట్టడానికి కారణం?

`వెంకిమామ‌`కి సంబంధించిన ప్ర‌త్యేక‌త‌లు ఏంటంటే.. నిజజీవితంలో త‌న మేన‌ల్లుడైన యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య ఇందులోనూ అదే వ‌రసైన పాత్ర‌లో క‌నిపించాడు.  అంత‌కుముందు చైతూ హీరోగా న‌టించిన `ప్రేమ‌మ్`లోనూ వెంకీ మేన‌మామ‌గానే అతిథి పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌డం గ‌మ‌నార్హం. అలాగే.. వెంకీ సోద‌రుడు, ప్ర‌ముఖ నిర్మాత డి. సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించ‌డం మ‌రో విశేషం. మొత్తంగా.. త‌మ ఫ్యామిలీ ట‌చ్ తో రూపొందిన సినిమానే త‌న‌ బ‌ర్త్ డేకి రిలీజైన తొలి చిత్రంగా రికార్డుల‌కెక్క‌డం వెంకీకి ఎంతో ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. కాగా,  2019లో అంటే రెండేళ్ళ క్రితం ఇదే రోజున విడుద‌లై వెంకీ అభిమానుల ఆద‌ర‌ణ‌ను పొందింది `వెంకిమామ‌`.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com