ఆ హోటల్ కి విక్టరీ వెంకటేష్ వెళ్ళింది అందుకేనంట
on Dec 11, 2023
విక్టర్ వెంకటేష్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రేస్టీజియస్ట్ మూవీ సైంధవ్.. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ వేగవంతం చేసారు. అందులో భాగంగా వెంకటేష్, హీరోయిన్ శ్రద్ద శ్రీనాధ్ అండ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ రోజు విజయవాడ వెళ్లారు. ఈ సందర్భంగా వెంకటేష్ విజయవాడలో ఒక చోటుకి వెళ్లి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.
వెంకటేష్ ఈ రోజు విజయవాడ లో బాగా ఫేమస్ హోటల్ అయిన బాబాయ్ హోటల్ ని సందర్శించాడు. తనకిష్టమైన ఐటమ్స్ ని తెప్పించుకొని కడుపునిండా తిన్నాడు.వెంకటేష్ తో పాటు శ్రద్ద శ్రీనాధ్ , శైలేష్ కొలను లు కూడా హోటల్ ని సందర్శించిన వాళ్ళల్లో ఉన్నారు. అలాగే బాబాయ్ హోటల్ కి వచ్చే ముందే వెంకటేష్ కనకదుర్గమ్మ కొండకెళ్లి అమ్మ వారిని దర్శనం చేసుకున్నాడు.ప్రత్యేక పూజలు నిర్వహించి తన సైంధవ్ సినిమా హిట్ కావాలని కోరుకున్నాడు.. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి వెంకటేష్ కి ఆయనతో పాటు ఉన్న వారికి తీర్ధ ప్రసాదాలు అందచేశారు. వెంకటేష్ వస్తున్నారని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ ఉదయం నుంచే గుడి దగ్గర,బాబాయ్ హోటల్ దగ్గర క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి తొక్కిసిలాట జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు.అలాగే వెంకటేష్ కొంత మంది తమ అభిమానులతో సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
వెంకటేష్ నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న సైంధవ్ మీద వెంకటేష్ అభిమానుల్లోను ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. హిట్ చిత్రం సిరీస్ తర్వాత శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని నిహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి, ఆర్య ,రుహనీ శర్మ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
