విక్రమ్ కి బిగ్ షాక్.. 'వీర ధీర శూరన్' వాయిదా.. అసలేం జరిగింది?
on Mar 27, 2025
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం 'వీర ధీర శూరన్'. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(మార్చి 27) థియేటర్లలో అడుగు పెట్టాల్సి ఉంది. విక్రమ్ అభిమానులతో పాటు, సినీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందరో టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ, విడుదల రోజు ఊహించని షాక్ తగిలింది. షో క్యాన్సిల్ అయిందని, టికెట్ మనీ రిఫండ్ చేస్తామని మెసేజ్ లు వస్తున్నాయి. దీంతో టికెట్ బుక్ చేసుకున్నవారికి ఏం జరిగిందో అర్థంకావట్లేదు. అయితే దీనంతటికి కారణం లీగల్ సమస్యలే అని తెలుస్తోంది. (Veera Dheera Sooran)
'వీర ధీర శూరన్' మూవీ చిక్కుల్లో పడింది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో ముంబైకి చెందిన ఒక కంపెనీ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. థియేట్రికల్ రిలీజ్ కి ముందే ఓటీటీ రైట్స్ అమ్ముతామని అగ్రిమెంట్ చేసుకున్న నిర్మాతలు.. రైట్స్ విషయం తేల్చకుండానే సినిమాని రిలీజ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో 'వీర ధీర శూరన్' విడుదలకు బ్రేక్ పడింది. ఇప్పటికే మార్నింగ్ షోలు, మ్యాట్నీ షోలు క్యాన్సిల్ అయ్యాయి. అసలు ఈరోజు మూవీ విడుదల ఉంటుందా లేదా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. సోషల్ మీడియాలో ఈ సినిమా వాయిదా పడిందనే వార్తలొస్తున్నాయి. అయితే ఎలాగైనా ఈరోజు ఈవెనింగ్ షోల నుంచి 'వీర ధీర శూరన్'ను ప్రదర్శించేలా అడుగులు పడుతున్నాయి. కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డిస్ట్రిబ్యూటర్స్ అసోషియేషన్ రంగంలోకి దిగి వివాదానికి ఫుల్ స్టాప్ వేసే ప్రయత్నం చేస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే.. సాయంత్రం 6 గంటల నుంచి షోలు పడే అవకాశముంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
