బావకి ఓటమి.. బామ్మర్దికి గెలుపు.. ఆలోచనల్లో ఎంత తేడా..?
on Feb 12, 2018

ఈ వారం మెగా ఫ్యామిలి కానీ.. మెగా హీరోలు కానీ ఎప్పుడూ చూడని ఒక వాతావరణం కనిపించింది. ఆ కుటుంబం నుంచి వచ్చిన హీరోల సినిమాలు ఏవి కూడా ఒకే రోజు కానీ.. తర్వాతి రోజు కానీ విడుదలైన చరిత్ర లేదు. వరుస ఫ్లాపుల్లో ఉన్న సాయిధరమ్ తేజ్ ఇంటిలిజెంట్‌గా.. ఫిదా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ.. వన్ డే గ్యాప్‌తో రావడం బావబామ్మర్ధుల యుద్ధమని.. విజయం ఎవరిదంటూ సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడిచింది. జయాపజయాలపై ఎవరి లెక్కలు వారివే. తీరా ముందుగా వచ్చిన ఇంటిలిజెంట్ ఘోరంగా దెబ్బతినగా.. తొలిప్రేమ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.
రెండు సినిమాలను.. ఇద్దరు మెగా హీరోల ఆలోచనలను అనాలిసిస్ చేస్తున్నారు. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తోన్న సాయికి మొదటి మూడు సినిమాలు మంచి రిజల్ట్‌ని ఇవ్వగా.. తర్వాత చేసిన సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ డిజాస్టర్లుగా నిలిచాయి. మాస్ హీరో స్టేటస్ కోసం.. రోటీన్ ఫార్ములాలను ఎంచుకుని సాయి చేతులు కాల్చుకున్నాడు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రేమకథలతో ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.. మాస్ కోసం ట్రై చేసిన లోఫర్‌ను జనాలు తిప్పికొట్టడంతో.. యాక్షన్ స్టంట్ల జోలికి వెళ్లకుండా.. మళ్లీ ప్రేమకథల బాట పట్టాడు. అలా ఫిదా లాంటి బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక వెరీ రీసెంట్ తొలిప్రేమతో హిట్ ట్రాక్‌లో దూసుకెళ్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



