వరుణ్ తేజ్‌కు ఎలాంటి అమ్మాయి ఇష్టమంటే...
on Jan 26, 2021
తక్కువ టైమ్‌లోనే హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, తన సినిమాలకు మార్కెట్‌నూ సృష్టించుకున్నాడు వరుణ్ తేజ్. చెప్పాలంటే ప్రస్తుతం అతను మినిమమ్ గ్యారంటీ హీరోగా డిస్ట్రిబ్యూటర్స్ నమ్ముతున్నారు. 'ఫిదా', 'తొలిప్రేమ' లాంటి ప్యూర్ లవ్ స్టోరీలు చేసిన వరుణ్ తేజ్, 'కంచె' లాంటి పీరియడ్ లవ్ స్టోరీని చేశాడు. 'ఎఫ్ 2' మూవీలో హనీ అనే అమ్మాయి ప్రేమలో పడి, ఎలాంటి ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యాడో చూశాం.
31 సంవత్సరాల వరుణ్ ఇంకా బ్యాచిలర్హుడ్ను ఎంజాయ్ చేస్తున్నాడు. నిజ జీవితంలో అతను ఎలాంటి అమ్మాయిలను ఇష్టపడతాడు? ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు జవాబు చెప్పాడు వరుణ్. అన్ని విషయాల్లో ఇంట్లో వాళ్ల ఆధారపడి ఉండే అమ్మాయిల కంటే స్వతంత్రంగా ఆలోచించే అమ్మాయిలంటే ఇష్టపడతానని అతనంటాడు. అందులోనూ కెరీర్ ఓరియంటెడ్‌గా ఉండే అమ్మాయిలంటే అతడికి ఎక్కువ ఇష్టం.
మరి ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టం ఉండదు? ప్రతి చిన్న విషయానికీ అదేంటి, ఇదేంటి అని ప్రశ్నించే అమ్మాయిలంటే ఇష్టం ఉండదంటున్నాడు ఈ పొడగరి హీరో. అలాగే అయిన దానికీ, కాని దానికీ ఏడుస్తూ ఉండే అమ్మాయిలన్నా ఇష్టం ఉండదంట. అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మాయిలంటే ఇష్టమన్న మాట. అయితే ఇప్పట్లో తన ఆలోచనంతా వర్క్ మీదే ఉంది తప్ప, పెళ్లి మీద లేదని వరుణ్ తేజ్ తేల్చేశాడు.
ప్రస్తుతం అతను 'గని', 'ఎఫ్ 3' సినిమాలు చేస్తున్నాడు. 'గని'లో బాక్సర్‌గా నటిస్తున్న అతను, 'ఎఫ్ 3'లో మరోసారి వెంకటేశ్‌తో స్క్రీన్ పంచుకుంటున్నాడు.