మహేష్ సెట్లో బాలీవుడ్ స్టార్ల హంగామా
on Sep 25, 2015
శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న మూవీ బ్రహ్మోత్సవం. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ రామోజి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే అక్కడే షూటింగ్ జరుపుకుంటున్న షారుఖ్ ఖాన్ 'దిల్ వాలే' సినిమా కాస్ట్ మొత్తం బ్రహ్మోత్సవం లోకేషన్లో ఉండటం విశేషం. మొన్న సూపర్ స్టార్స్ షారుఖ్, మహేష్ కలిసి కాసేపు ముచ్చటించిన సంగతి తెలిసిందే. షారుఖ్ మహేష్ క్రేజ్ గురించి పొగడటం కూడా ఫ్యాన్స్ లో ఉత్తేజాన్నిచ్చింది. అయితే షారుఖ్ తర్వాత రీసెంట్ గా ఆ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న కృతి సనన్ కూడా వరుణ్ ధావన్ తో కలిసి బ్రహ్మోత్సవం సెట్ లో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చిందట.
మహేష్ బాబుతో '1 నేనొక్కడినే' సినిమా చేసిన కృతి అప్పటినుండి మహేష్ తో మంచి రాపో మెయింటైన్ చేస్తుంది. 'దిల్ వాలే'లో వరుణ్ ధావన్ జోడీగా చేస్తున్న ఈ బ్యూటీ పక్క బ్లాక్లో బ్రహ్మోత్సవం షూటింగ్ జరుగుతుందని తెలిసివరుణ్ ని వెంటబెట్టుకు వచ్చి మరి మహేష్ ను కలిసింది. చూస్తుంటే బ్రహ్మోత్సవం షూటింగ్ సగం బాలీవుడ్ సెలబ్రిటీస్ వల్లే డిస్ట్రబ్ అయ్యేట్టుగా ఉంది. ఇంకో విధంగా చూస్తే ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ దొరుకుతుందని భావిస్తున్నారు బ్రహ్మోత్సవం చిత్ర యూనిట్. మొత్తానికి బ్రహ్మోత్సవానికి బాలీవుడ్ తాకిడి ఎక్కువైందని చెప్పొచ్చు.