రిలీజ్‌కి ముందే రికార్డు.. ఆ విధంగా ‘వారణాసి’ ఇండియాలోనే ఫస్ట్ మూవీ!
on Jan 30, 2026

రాజమౌళి తన ప్రతి సినిమా కొత్తగా ఉండాలని ఆలోచిస్తారు. మేకింగ్ దగ్గర నుంచి ఆర్టిస్టుల ఎంపిక, రిలీజ్‌కి ముందు చేసే ప్రమోషన్స్, మార్కెటింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఎవరూ చేయని ప్రక్రియ తాను చేయాలని ఆరాటపడుతుంటారు. అందులో భాగంగానే ఇప్ప్పుడు మహేష్‌తో చేస్తున్న సినిమా కోసం ఎవరూ చేయని సాహసం చేయబోతున్నారు రాజమౌళి.
సూపర్‌స్టార్ మహేష్‌తో చేస్తున్న ‘వారణాసి’ సినిమాలో అంతకు ముందు రాజమౌళి సినిమాల్లో చూడని కొత్త విశేషాలు కనిపించబోతున్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ కోసం అంటార్కిటికా వెళ్ళబోతోంది చిత్ర యూనిట్. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని రాజమౌళి ప్లాన్ చేశారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తమ సినిమాలను అక్కడ షూట్ చేసేందుకు దర్శకనిర్మాతలు సాహసించరు. ఇప్పటివరకు అంటార్కిటికాలో ఏ ఇండియన్ సినిమా చేయలేదు. అంతేకాదు, ప్రపంచ సినిమా చరిత్రలో అక్కడ షూట్ చేసిన సినిమాలు నాలుగు మాత్రమే. ఇప్ప్పుడు ‘వారణాసి’ ఐదో సినిమాగా చరిత్రకెక్కబోతోంది.
ఇప్పటికే ఆ ప్రాంతంలోని లొకేషన్స్‌ను పరిశీలిస్తున్నారు రాజమౌళి అండ్ టీమ్. షూటింగ్‌కి అనుకూలంగా ఉండే ప్రదేశాల కోసం అన్వేషిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ‘వారణాసి’ చిత్రానికి కావాల్సినంత హైప్ లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాకి అదే ప్రధాన హైలైట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో పథ్విరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో కనిపిస్తారు. ఇండియాలోనే భారీ బడ్జెట్‌తో కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఇటీవల వార్తలు వచ్చాయి. అది నిజమా, కాదా అనే చర్చ కూడా జరిగింది. జనవరి 30న చిత్ర యూనిట్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించడంతో 2027 ఏప్రిల్ 7 ‘వారణాసి’ రిలీజ్ డేట్‌గా కన్‌ఫర్మ్ అయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



