మరోసారి... 'మహర్షి' కాంబినేషన్!
on Dec 5, 2019
.jpg)
'సరిలేరు నీకెవ్వరు' విడుదల తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు మూడు నెలలు బ్రేక్ తీసుకోనున్నారు. తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారనేది ఇప్పటివరకూ ఒక పజిల్. కానీ, ఇకపై కాదు. 'కెజిఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్, రాజమౌళి, త్రివిక్రమ్... పలువురి దర్శకుల పేర్లు మహేష్ పేరుతో వినిపించాయి. ఆ కాంబినేషన్లో సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ వర్గాల్లో వినిపించింది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయనున్నాడు.
మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'మహర్షి' మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తన తదుపరి సినిమా మహేష్ తో ఉండొచ్చని వంశీ పైడిపల్లి నుండి లీకులు వచ్చారు. ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. లొకేషన్ రెక్కీ కోసం విశాఖపట్టణం వెళ్ళినప్పుడు మహేష్ తో మరోసారి సినిమా చేయబోతున్నట్టు వంశీ పైడిపల్లి స్పష్టం చేశారు. ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మించనున్నారని టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



