'వకీల్ సాబ్'... మళ్లీ మ్యూజిక్ స్టార్ట్!
on Aug 13, 2020
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పని అయ్యేటప్పటికీ బాడీలో ఎనర్జీ ఫ్లో డిఫరెంట్ గా ఉంటుందని హ్యాపెనింగ్ & సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ అంటున్నాడు. ఏదో తెలియని శక్తి శరీరంలో ప్రవహిస్తుందన్నాడు. సినిమాల నుండి కొంత విరామం తీసుకుని రాజకీయాల్లోకి వెళ్ళి వచ్చిన పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్'తో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఓ బ్రేక్ తర్వాత మళ్లీ ఈ సినిమా మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేశానని తమ చెప్పుకొచ్చాడు. ఆల్రెడీ 'వకీల్ సాబ్'లో 'మగువా... మగువా' ఆట విడుదలై శ్రోతలను ఆకట్టుకుంది. ఇప్పుడు మిగతా ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారేమో!
పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనున్న లేటెస్ట్ సినిమా 'సర్కారు వారి పాట'కి సైతం తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రవితేజ 'క్రాక్'తో పాటు మరికొన్ని సినిమాల్లో అతడి ఖాతాలో ఉన్నాయి.
Also Read