తిండి, నిద్ర మానేసి రాత్రంత అదే పని.. దాంతో ఆరోగ్యం నాశనం
on Dec 15, 2025

ఊర్వశి చెప్పిన సంచలన విషయాలు
ఏం చెప్పింది!
రాత్రంతా ఏం పని
తను ఎందుకు అలవాటు చేసుకుంది!
అందంతో పాటు అందానికి తగ్గ అభినయం కలగలిపిన వాళ్ళని ఇంద్రలోకంలో ఉండే రంభ, ఊర్వశి, మేనక తో పోలుస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో ప్రముఖ నటి 'ఊర్వశి'(Urvashi)కూడా ఒకరు. అందుకే కవిత రేంజిని అనే తన పేరుని ఊర్వశి గా మార్చారేమో. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఊర్వశి తన సొంత భాష మళయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఇప్పటి వరకు సుమారు 350 కి పైగా చిత్రాల్లో చేసింది. హీరోయిన్ గా అలరించిన చిత్రాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. నేటికి తన కట్ అవుట్ కి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. రీసెంట్ గా ఊర్వశి ఒక ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో ఆమె చెప్పిన కొన్ని విషయాలు వైరల్ గా నిలిచాయి.
ఆమె మాట్లాడుతు 'మొదటి సారి పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టినప్పుడు వాతారవరణం చాలా కొత్తగా అనిపించింది.ఇంట్లో అందరూ కలిసి తాగడం, తినడం చేసే వారు. దాంతో ఎంత వద్దని అనుకున్నా, ఆ అలవాట్లు నాకు వచ్చాయి. షూటింగ్ నుంచి రాగానే ఆల్కహాల్ తాగడం అలవాటైపోయింది. క్రమంగా అది ఒక వ్యసనంగా మారిపోయింది. అప్పటికే ఇంటి బాధ్యత భుజాన పడటంతో ఇష్టం లేని పనులు కూడా చేశాను. నా అభిప్రాయాలూ ఇంట్లో ఎవరకి నచ్చక పోవడంతో కోపంతో మరింత ఎక్కువగా తాగే దాన్ని. తిండి, నిద్ర మానేసి తాగడంతో ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాను. ఆ తర్వాత నా స్నేహితులు, పర్సనల్ స్టాఫ్ వల్ల ఆ వ్యసనం నుంచి బయటపడగలిగానని ఊర్వశి చెప్పుకొచ్చింది.
also read: మహేష్ కి తండ్రిగా లెజండ్రీ యాక్టర్ ! రాముడు కదా ఫ్యాన్స్ ఏమంటారో మరి
ఊర్వశి వ్యక్తి గత విషయానికి వస్తే 2000 వ సంవత్సరంలో ప్రముఖ మలయాళ నటుడు 'మనోజ్ కె జయన్'(Manoj K jayan)ని పెళ్లి చేసుకొని, 2008 లో విడాకులు తీసుకుంది. జయన్ 1988 లో సినీ రంగ ప్రవేశం చేసి స్టార్ యాక్టర్ గా గుర్తింపు పొందాడు. సుమారు వంద చిత్రాలు తన ఖాతాలో ఉండగా నేటికీ ఎన్నో భారీ చిత్రాల్లో చేస్తు తన సత్తా చాటుతున్నాడు. తెలుగులో కూడా వీడే, శౌర్యం వంటి చిత్రాల్లో కనిపించాడు. ఊర్వశి, జయన్ కి ఒక కూతురు ఉంది. అనంతరం 2013 లో శివ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా ఆ ఇద్దరికి ఒక కొడుకు ఉన్నాడు. శివ ప్రసాద్ చెన్నై కి చెందిన బిజినెస్ మెన్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



