చేతులు తగలగానే షాక్ తగిలే లవ్ స్టోరీనా!.. చరణ్ కి ప్రేమ పరీక్ష పెట్టిన ఉపాసన
on Aug 11, 2025

గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్',(Ram Charan)'ఉపాసన'(Upasana)వివాహం 2012 జూన్ 14 న అభిమానులు, బంధు మిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని,ఇరువైపులపెద్దలని ఒప్పించి జీవితభాగస్వామ్యులవ్వగా, 2023 జూన్ 20 న 'క్లీంకార'(Klin Kaara)అనే పాపకి జన్మినిచ్చారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే చరణ్, ఉపాసన తమ ఇద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలని అభిమానులతో పంచుకుంటు వస్తున్నారు.
రీసెంట్ గా 'ఉపాసన' ఓ యూట్యూబ్ ఛానల్ కోసం హోమ్ టూర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతు ప్రేమలో ఉన్నప్పుడు చరణ్ కి ఒక ప్రేమ పరీక్ష పెట్టాను. నువ్వు నిజంగా నన్ను ప్రేమించనవాడివైతే హైదరాబాద్ లోని ఛార్మినార్(Charminar)దగ్గర ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ దగ్గరకి తీసుకెళ్లాలని చెప్పాను. దాంతో చరణ్ నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. అది చరణ్ కి నిజమైన లవ్ టెస్ట్. తమది మగధీర సినిమాలోలాగా, చేతులు తగలగానే షాక్ ఇచ్చే సినిమాటిక్ లవ్ స్టోరీ కాదు. చార్మినార్ దగ్గర అందరు చరణ్ ని గుర్తు పట్టడంతో, ఒక్కసారిగా చరణ్ పై పడిపోయారు.
చిరంజీవి(Chiranjeevi)మావయ్య లాగానే చరణ్ ఫుడ్ లవర్. ప్రపంచంలో ఉన్న ఏ పెద్ద రెస్టారెంట్ కి వెళ్లినా, నాకు ఇండియన్ ఫుడ్ కావాలని అడుగుతాడు. ఆ విషయంలో ఒక్క ఐటెం అయినా, ఇండియన్ ఫుడ్ ఉండాల్సిందే. ఎక్కువగా స్పైసి ఫుడ్ తినడంతో పాటు, రసం అన్నం అంటే చాలా ఇష్టపడతాడని ఉపాసన చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు మెగా అభిమానులతో పాటు,నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చరణ్ సినిమాల విషయానికి వస్తే అప్ కమింగ్ మూవీ 'పెద్ది' తో బిజీ గా ఉన్నాడు. చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27 2026 న విడుదల కానుంది. బుచ్చిబాబు సాన దర్శకుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



