ముద్దు వివాదంపై స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్ ఆసక్తి కర వ్యాఖ్యలు
on Feb 1, 2025
భారతీయ సంగీత ప్రియులకి స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్(Udit Narayan)గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.ఆయన గాత్రం వింటే చాలు సంగీత ప్రియులు చెవులు కోసుకుంటారు.ముఖ్యంగా హిందీలో అయితే ఎన్నో అద్భుతమైన పాటలు పాడాడు. 1988 లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన' ఖయామత్ సే ఖయామత్' తో మొదలైన ఆయన జైత్ర యాత్ర మొత్తం36 భాషల్లో 25000 కి పైగా పాటలని ఆలపించే దాకా వెళ్ళింది.
రీసెంట్ గా ఆయన ఒక కాన్సర్ట్ నిర్వహించగా అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.దీంతో ఫోటో దిగడానికి వచ్చిన మహిళా అభిమానుల పెదవుల మీద అయన ముద్దు పెట్టడం జరిగింది.ఈ విషయంపై పలువురు నుంచి విమర్శలు వస్తున్ననేపథ్యంలో ఒక ఆంగ్ల ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఉదిత్ నారాయణ్ మాట్లాడుతు అభిమానులకి నేనంటే చాలా ఇష్టం.దీంతో వాళ్ల అభిమానంలో భాగంగా కొంత మంది షేక్ హ్యాండ్ ఇస్తారు.ఇంకొంత మంది ముద్దు పెట్టుకోవాలని చూస్తారు.అదంతా ఆప్యాయతలో భాగమే.తప్పుగా ప్రవర్తించే ఉదేశ్యం లేదు.సమాజంలో మాకు మంచి పేరు ఉంది.వాళ్ల మీద నా కున్న అభిమానాన్ని చాటి చెప్పడానికే అలా చేసానని చెప్పుకొచ్చాడు.
ఉదిత్ నారాయణ్ తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ గీతాలని ఆలపించారు. 'చూడాలని ఉంది' లోని 'రామ్మా చిలకమ్మా' 'కలిసుందాం రా' లోని 'ఫసిఫిక్ లో దూకేయమన్న దూకేస్తానే', 'ఖుషి' లోని 'అమ్మాయేసన్నగా' 'స్వయంవరం' లోని 'కీరవాణి రాగంలో' లాంటి మెమొరీబిల్ సాంగ్స్ ఆ లిస్ట్ లో ఉన్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
