
సినీ కళామతల్లి ఒడి నుంచి పాలిటిక్స్ లో సంచలనం సృష్టిస్తున్నాడు ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం డిఎంకె ఎంఎల్ఏ గా సేవలందిస్తున్న ఉదయనిధి తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచయస్తుడే. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకడిగా ఉన్నాడు. డిఎంకె అగ్రనేత ఎం.కె. స్టాలిన్ కుమారుడైన ఉదయ్‌నిధి స్టాలిన్, రీసెంట్ గా సహ నటి 'త్రిష'పై మాట్లాడిన మాటలు,రాజకీయ పరిణామాలు మరియు అరెస్ట్ వివాదాల నేపథ్యంలో వార్తల్లో నిలిచాడు . ఈ పొలిటికల్ హీట్ మధ్యలోనే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అరుదైన విషయాలు, భార్య కృతిక, పిల్లలతో కలసి ఉన్న కుటుంబ చిత్రాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక బాధ్యతాయుతమైన భర్తగా, స్నేహపూర్వక తండ్రిగా ఉదయనిధిని ప్రతిబింబించే ఈ ఫొటోలు నెటిజన్లని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 1977 నవంబర్ 27న జన్మించిన ఉదయ్‌నిధి స్టాలిన్, చెన్నైలోని ప్రతిష్టాత్మక లోయోలా కాలేజీ నుండి బిజినెస్ కామర్స్ పట్టా పొందారు. 2002 సంవత్సరంలో కృతికా రామసామిని వివాహమాడారు. దాదాపు 24 ఏళ్లకు పైగా అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్య బంధం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. కృతికా కేవలం ఉదయ్‌నిధి భార్యగానే కాకుండా, తమిళ చలనచిత్ర రంగాన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 2013లో 'వణక్కమ్ చెన్నై' చిత్రంతో దర్శకురాలిగా తెరంగేట్రం చేసిన కృతిక, ఆ తర్వాత 2018లో 'కాళీ', 2022లో 'పేపర్ రాకెట్' వెబ్ సిరీస్, అలాగే 2025లో 'కాదలిక్క నేరమిల్లై' వంటి పలు ప్రాజెక్ట్‌లను తెరకెక్కించి విజయవంతమైన మహిళా దర్శకురాలిగా నిలిచారు.
ఉదయ్‌నిధి, కృతిక దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. 2004లో జన్మించిన కుమారుడు ఇన్‌బనిధి స్టాలిన్, 2006లో జన్మించిన కుమార్తె తన్మయ స్టాలిన్. కుమారుడు ఇన్‌బనిధికి క్రీడల పట్ల అపారమైన ఆసక్తి ఉంది. ఆయన ప్రసిద్ధ ఐ-లీగ్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన 'నెరోకా ఎఫ్‌సి' (NEROCA FC) తరఫున ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా ఒప్పందం కుదుర్చుకుని మ్యాచ్‌లు ఆడుతున్నారు. మరోవైపు కుమార్తె తన్మయ తన ఉన్నత చదువులపై దృష్టి సారించారు. రెడ్ జైంట్ మూవీస్ (Red Giant Movies) పతాకంపై 2008 నుండి అనేక ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించి, పంపిణీ చేసిన ఉదయ్‌నిధి, 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి డిఎంకె యూత్ వింగ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా, తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఉదయ్‌నిధి తన కుటుంబంతో గడిపే సమయానికి ప్రాధాన్యత ఇస్తారు.
udhayanidhi stalin, Trisha





