
రేణూ దేశాయ్ నటిగా పరిచయమైన చిత్రం.. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన తొలి చిత్రం ఒక్కటే.. అది 'బద్రి'. ఆ మూవీ విడుదలై సోమవారంతో సరిగ్గా 20 ఏళ్లు. ఈ సందర్భంగా ఆ సినిమా షూటింగ్ లొకేషన్‌లో ఒకరోజు ప్యాకప్ చెప్పాక తను, పవన్ కల్యాణ్ కలిసి ఉన్న ఒక పిక్చర్‌తో పాటు, మరికొన్ని పిక్చర్స్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో రేణు షేర్ చేయడం పవన్ ఫ్యాన్స్‌లో కొంతమందిని ఇరిటేట్ చేసింది. ఇప్పుడు ఈ పిక్చర్స్ షేర్ చెయ్యడం అవసరమా అంటూ ఆమెను ట్రోల్ చేస్తూ వచ్చారు. అలా తనకు వచ్చిన మెసేజెస్‌లో ఒకదాన్ని రేణు షేర్ చేసి, ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ట్రోలర్ ఏమని మెసేజ్ చేశాడంటే.. "ఈ రేణూ దేశాయ్ ఏంటో మళ్లీ కెలుకుతూంది. అవసరమా ఇప్పుడు. ఆ మధ్య చాలా ఓ చేసింది. మళ్లీ ఈ పోస్టులు ఎందుకు.. ఎంగేజ్‌మెంట్ అయ్యింది కదా ఆ విషయం ఏమైంది మళ్లీ? న‌్యూ న్యూస్.." ఈ ట్రోల్ చేసిన వ్యక్తి పేరును మాత్రం రేణు బహిర్గతం చేయలేదు. అతని పేరు కనిపించకుండా కొట్టివేశారు. ఆ మెసేజ్‌కు ఆమె రిప్లై కూడా ఇచ్చారు.
"నాకు ఇప్పుడే ఈ స్క్రీన్ షాట్ వచ్చింది నా మెసేజెస్‌లో. అవసరమా? అవును, అవసరం! ఇది 20 సంవత్సరాల 'బద్రి'.. మీ ఇన్‌ఫర్మేషన్ కోసం. చాలా మంది మర్చిపోతారు ఈ నా మొదటి సినిమా. సో ఈ మూవీ నా కోసం చాలా చాలా స్పెషల్ ఉంటుంది. ఇంత ద్వేషం ఎందుకు అన్నా? మనం ఆల్రెడీ ఒక వరల్డ్ క్రైసిస్‌లో ఉన్నాం ఈ వైరస్ వల్లే. కొంచెం మంచి ఆలోచనలో పెట్టుకోండి అందరి కోసం. ఇంత కోపం మీ ఆరోగ్యం కోసం మంచి లేదు. లివ్ అండ్ లెట్ లివ్" అని తనకు తెలిసిన తెలుగులో (ఇంగ్లీష్ లిపిలోనే) కోరారు రేణు. అప్పుడప్పుడూ ఆమె తన జ్ఞాపకాల చిట్టాలోంచి ఏదో ఒకదాన్ని షేర్ చేయడం, దానిపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ కావడం జరుగుతూ వస్తోంది.






