ఎన్టీఆర్ న్యూ లుక్‌పై పెరిగిన ట్రోలింగ్.. తిప్పికొడుతున్న ఫ్యాన్స్!
on Dec 6, 2025
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఆర్‌ఆర్‌ఆర్‌కి ముందు, ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత అన్నట్టుగా పెరిగిపోయింది. రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకైనా ఫ్లాప్ కన్‌ఫర్మ్ అనే సెంటిమెంట్‌ని దేవరతో బ్రేక్ చేశారు ఎన్టీఆర్. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రపంచస్థాయి హీరోగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల వార్2తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్‌కు చుక్కెదురైంది. ఈ సినిమా బాలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. అయినప్పటికీ ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
కెజిఎఫ్ సిరీస్, సలార్ వంటి భారీ విజయాలతో దూసుకుపోతున్న ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని చెప్పుకుంటున్నారు. అయితే ఇది అనఫీషియల్ న్యూస్ మాత్రమే. ఈ సినిమా కోసం తన లుక్‌ని పూర్తిగా మార్చుకుంటున్నారు ఎన్టీఆర్. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫిజికల్ ట్రైనింగ్ స్టిల్స్ బయటికి వచ్చాయి.
ఇదిలా ఉంటే.. మలబార్ గోల్డ్ సంస్థకు ఎన్టీఆర్ చేసిన కొత్త యాడ్‌లో ఎన్టీఆర్ లుక్‌పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. చాలాకాలంగా ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఎన్టీఆర్ గతంలో దీని కోసం చాలా యాడ్స్ చేశారు. అయితే ఇంతకుముందు యాడ్స్‌లో ఎన్టీఆర్ లుక్‌కి, తాజాగా వచ్చిన యాడ్‌లో ఎన్టీఆర్ లుక్‌కి చాలా తేడా కనిపించింది. అంతకుముందు ఎనర్జిటిక్‌గా కనిపించిన ఆయన.. కొత్త యాడ్‌లో ఆ స్థాయి ఎనర్జీ కనిపించకపోవడం, గడ్డం తీరులో కూడా ఎంతో మార్పు ఉండడమే ట్రోలింగ్‌కి కారణమవుతోంది. దీంతో నెటిజన్లు ఎన్టీఆర్ లుక్‌పై కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్ ఎన్టీఆర్‌కి సెట్ అవ్వలేదని, హెయిర్ స్టైల్ కూడా బాగాలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ అంతకంతకు పెరిగిపోతుండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి వాటిని తిప్పికొడుతున్నారు.
పెద్ద హీరోలెవరైనా తాము చేసే పాత్రల కోసం రకరకాల లుక్స్ ట్రై చెయ్యడం సహజమేనని, దాన్ని తప్పుగా చూడడం కరెక్ట్ కాదని అంటున్నారు. సినిమాలోని లుక్ కంటే ఆ పాత్రను ఎంత సమర్థవంతంగా పోషించాడు అనేది ముఖ్యమని ఫ్యాన్స్ సమాధానమిస్తున్నారు. సినిమా పరంగా కాకుండా, ఒక యాడ్‌లో ఎన్టీఆర్ లుక్‌కి ఈ స్థాయిలో చర్చ జరగడం అనేది ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్‌కి నిదర్శమని అర్థమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



