Home

»

Latest News

త్రివిక్రం దర్శకత్వంలో రామ్ చరణ్

Mar 14, 2011 7:42PM

trivikram srinivas ram charan movieత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యువ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా నటించనున్నాడని తెలిసింది. ఈ సినిమా కథని త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగా విక్టరీ వెంకటేష్ కి చెప్పగా ఆయన హీరోగా నటించేందుకు అంగీకరించారు. కాని కొన్ని కారణాల వల్ల ఆతనీ సినిమా నుంచి తప్పుకున్నారు.

 

ఇదే కథని అల్లు అర్జున్ కి త్రివిక్రం శ్రీనివాస్ చెప్పగా ఆ కథ ఆయనకి కూడా నచ్చి ఆ సినిమాలో నటించటానికి అంగీకరించారు. అయితే ప్రస్తుతం ఈ కథ ఆయన దగ్గర నుంచి కూడా మారి ప్రస్తుతం యువ హీరో రామ్ చరణ్ తేజ దగ్గరకు వచ్చి చేరింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తే, ఆ సినిమా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మహేష్ బాబుని "అతడు" సినిమాలో త్రివిక్రమ్ చూపించిన తీరు అద్భుతం.

 

అలాగే "జల్సా" చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ చూపించిన తీరు అమోఘం. తాను స్వయంగా రచయిత అవటం వల్ల తన చిత్రంలోని డైలాగులు ఎలా ఉంటే బాగుంటాయో, ఎంతవరకు ఉంటే బాగుంటాయో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి బాగా తెలుసు. రామ్ చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎంత బాగా నటిస్తాడో, ప్రేక్షకులను ఏ విధంగా రంజింపజేస్తాడో వేచి చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com