'జులాయి' నుంచి రాజేంద్రప్రసాద్‌ను భరిస్తున్నా: త్రివిక్రమ్
on Jan 13, 2020
"సునీల్ శక్తి సునీల్‌కు తెలీదు. మేం ఒక రూంలో కలిసున్నప్పుడు వాడు విలన్ అవుదామనుకున్నాడు. నేనేమో తెలుగు ఇండస్ట్రీలోని కామెడీ దిగ్గజాల్లో నువ్వూ ఒక దిగ్గజంగా నిలిచిపోతావని చెప్పా. అఫ్‌కోర్స్.. అప్పట్నుంచీ ఇప్పటిదాకా తను నా మాటల్ని నమ్మడం లేదు. ఎప్పుడు నమ్ముతాడో తెలీదు. పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు వచ్చాక ఇంకో 20 ఏళ్లకు నమ్ముతాడేమో" అని చెప్పారు డైరెక్టర్ త్రివిక్రమ్.
'అల.. వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ దగ్గర భరీ విజయం సాధించే దిశగా వెళ్తున్న సందర్భంగా సోమవారం చిత్ర బృందం థాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో త్రివిక్రమ్ మాట్లాడుతూ 'జులాయి' మూవీ నుంచి తాను రాజేంద్రప్రసాద్‌తో పడుతూనే ఉన్నానని ఆయన సరదాగా అన్నారు. "ఇంకా ఆయన్ని భరిస్తూనే ఉంటాను. వజ్రం కఠినంగా ఉంటుంది. అలా అని కిరీటంలో పెట్టుకోవడం మానేస్తామా? రాజేంద్రప్రసాద్ కూడా అంతే" అని చెప్పారు త్రివిక్రమ్. సుశాంత్ తనను కథ కూడా అడగలేదని ఆయ్న గుర్తు చేసుకున్నారు. "నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంటే వద్దన్నాడు. తను చేసిన పాత్రను నిలబెట్టాడు" అని చెప్పారు.
పూజ టైంకు వస్తుంది, క్యారెక్టర్‌ను బాగా అర్థం చేసుకుంటుంది, తెలివితేటలున్నాయి, అందంగా ఉంటుంది, అడిగినప్పుడు డేట్లిస్తుంది, ఈతరం అమ్మాయికి ప్రతినిధి కాబట్టే మళ్లీ రెండోసారి ఆమెను తీసుకున్నానని ఆయన్నారు. "ఐ రెస్పెక్ట్ హర్. 'నేను నెగ్గేవరకు అయినట్లు కాదు' అనేది తన వాట్సాప్ స్టేటస్" అని తెలియజేశారు త్రివిక్రమ్.
Also Read