Home

»

Latest News

2022లో నాగ్ ట్రిపుల్ ధ‌మాకా!

Nov 29, 2021

కింగ్ నాగార్జున నుంచి సాలిడ్ హిట్ వ‌చ్చి చాన్నాళ్ళే అయింది. ప్రీవియ‌స్ మూవీ `వైల్డ్ డాగ్` కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నా.. బాక్సాఫీస్ విన్న‌ర్ కాలేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో.. రాబోయే చిత్రాల‌పైనే నాగ్ ఫ్యాన్స్ ఆశ‌లు పెట్టుకున్నారు. కాగా, రీసెంట్ టైమ్స్ లో ఏడాదికి ఒక‌ట్రెండు సినిమాల‌తోనే స‌రిపెడుతూ వ‌స్తున్న నాగ్.. వ‌చ్చే సంవ‌త్స‌రం ఏకంగా మూడు చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `సోగ్గాడే చిన్ని నాయ‌నా`లో బంగార్రాజుగా ఎంట‌ర్టైన్ చేసిన నాగ్.. 2022 సంక్రాంతికి అదే `బంగార్రాజు`ని టైటిల్ గా చేసుకుని `సోగ్గాడే..` సిరీస్ లో రెండో చిత్రంతో వినోదాలు పంచ‌నున్నారు. అలాగే, ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ది ఘోస్ట్` కూడా వ‌చ్చే సంవ‌త్స‌రం ప్ర‌థ‌మార్ధంలో తెర‌పైకి రాబోతోంది. అంతేకాదు.. చాన్నాళ్ళ త‌రువాత నాగ్ చేస్తున్న హిందీ చిత్రం `బ్ర‌హ్మాస్త్ర‌` కూడా 2022 సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కాబోతోంద‌ని టాక్. `బిగ్ బి` అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌ణ్ బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సూప‌ర్ హీరో మూవీలో నాగ్ ఓ కీల‌క పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. తెలుగులో ఈ సినిమా అనువాద రూపంలో అల‌రించ‌నుంది. మ‌రి.. అభిమానుల‌కు నాగ్ ఇస్తున్న ఈ ట్రిపుల్ ధ‌మాకా ఎలాంటి ఫ‌లితాల‌ను అందిస్తుందో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com