Home

»

Latest News

అన్ని నేనే చేయాలంటున్న హీరో!.. ఆ లిస్ట్ ఇదే  

Jul 27, 2026 6:54PM

 

హీరో(Hero).. సెల్యులాయిడ్ పై హీరో చేసే నటన, పోరాటాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే మేరు పర్వతం కూడా. కానీ సినీ  కాలం మారుతున్న కొద్దీ టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలలో సరికొత్త ట్రెండ్ ఊపందుకుంటోంది. కేవలం నటనతో సరిపెట్టుకోవడం లేదు. తమలోని ఇతర ప్రతిభని  బయటకి  తీస్తూ పాటలు పాడటం, సొంతంగా సాహిత్యం అందించడం, కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చడం, దర్శకత్వం వైపు అడుగులు వేస్తూ అన్నీ తామే అయి వ్యవహరిస్తున్నారు. 

ఈ మల్టీ టాస్కింగ్ ట్రెండ్ నిజంగానే సినిమాపై ఉన్న ప్రగాఢమైన ప్యాషన్‌తో వస్తోందా లేక సినిమాపై సోషల్ మీడియాలో అదనపు బజ్ సృష్టించడానికి వాడుతున్న ఒక పబ్లిసిటీ స్ట్రాటజీనా అనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో మరియు ట్రేడ్ సర్కిల్స్‌లో తీవ్రంగా జరుగుతోంది. ఈ సరికొత్త మార్పు వెనుక అసలు కథ ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఈ ట్రెండ్‌కి  ఎప్పుడో పునాది వేసిన విశ్వనటుడు కమల్ హాసన్ నటుడిగా మాత్రమే కాకుండా సింగర్, లిరిక్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్‌గా అన్ని రంగాలలో తనదైన ముద్ర వేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆయన బాటలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా “వై దిస్ కొలవెరి డి” లాంటి సంచలన పాటలతో సింగర్‌గా మారి, ఆ తర్వాత ‘పా పాండి’, ‘రాయన్’, ‘ఇడ్లీ కడై’, ‘నిలవుక్కు ఎన్మేల్ ఎన్నడి కోపం’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించి తన అసాధారణ దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నారు. కేవలం తమిళ పరిశ్రమకే పరిమితం కాకుండా టాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు ఇదే బాటలో సాహసోపేతమైన అడుగులు వేస్తున్నారు. స్టార్ హీరో సూర్య ఇప్పటికే పలు పాటలు పాడిన అనుభవంతో తాజాగా ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఒక మధురమైన వెడ్డింగ్ సాంగ్‌ను స్వయంగా ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమా విడుదల కాకముందే హీరో స్వయంగా గళం విప్పడం ద్వారా ఆడియన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీ, అంచనాలు ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి.


Also read: మృణాల్ ఠాకూర్ లవర్ ఎవరో తెలిసిందోచ్.. వైరల్ అవుతున్న వీడియో 

అదేవిధంగా, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సైతం ‘అంధ్ర కింగ్ తాలూకా’ చిత్రంలో “నువ్వుంటే చాలే” అనే అద్భుతమైన పాటకు స్వయంగా సాహిత్యం అందించి, తనలోని రచనా ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక యువ హీరోల విషయానికి వస్తే, కిరణ్ అబ్బవరం కూడా ఇదే రూట్లో దూసుకుపోతున్నారు. తన తదుపరి చిత్రానికి కేవలం హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు అన్నీ తానే భరిస్తూ క్రియేటివ్ మేకర్‌గా మారుతున్నారు. మరోవైపు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు కూడా స్వయంగా ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేసుకుని, తనే స్వయంగా దర్శకత్వం వహించే ప్రయత్నాల్లో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Kamal Haasan, Suriya, Dhanush

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com