Home

»

Latest News

వైలెన్స్ వద్దు, ఫ్యామిలీ చిత్రాలే ముద్దు: విలువల వైపు పీచే మూడ్!

Oct 27, 2026 5:51PM


వైలెన్స్.. ఫ్యామిలీ జోనర్.. కంటెంట్ బాగుంటే రెండు జోనర్స్ హిట్ అవుతాయి. కాకపోతే  వైలెన్స్ కంటే ఫ్యామిలీ జోనర్ సేఫ్. కడుపులో నీళ్లు కదలకుండా సినిమాని హిట్ చేయవచ్చు . పైగా ఫ్యామిలీ జోనర్ లో విలువలు, ఆప్యాయతలు ఉంటాయి కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులు చలో టూ థియేటర్స్ అంటారు. పైగా రిపీట్ ఆడియెన్స్ సైతం పక్కా.    


అందుకే  టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక సరికొత్త ట్రెండ్ జోరందుకుంది. గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద కేవలం భీభత్సమైన యాక్షన్, రక్తపాతం, వైలెన్స్ సినిమాలే రాజ్యమేలుతున్నాయనే విమర్శలు వినిపించిన తరుణంలో, టాలీవుడ్ హీరోలు ఇప్పుడు రూటు మార్చుతున్నారు. "వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్" అంటూ కేవలం యాక్షన్ చిత్రాల చుట్టూనే తిరిగిన హీరోలంతా ఇప్పుడు ఒక్కసారిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే కేవలం కత్తులు, బాంబులే కాకుండా మనసుకు హత్తుకునే ఎమోషనల్ కంటెంట్ ముఖ్యం అని టాలీవుడ్ స్టార్స్ స్పష్టంగా గ్రహిస్తున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి కుటుంబం కలిసి చూడగలిగే కుటుంబ కథా చిత్రాలకు మళ్లీ ప్రాధాన్యత ఇస్తున్నారు.   ఈ అనూహ్య మార్పుకు మాస్ మహారాజా రవితేజ వంటి స్టార్స్ కూడా తమ రూటు మార్చడమే నిదర్శనం. మాస్ చిత్రాలతోనే కెరీర్ బిల్డ్ చేసుకున్న రవితేజ సైతం ఫ్యామిలీ మరియు డిఫరెంట్ కాన్సెప్ట్ కథల వైపు దృష్టి పెట్టడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే బాటలో చాక్లెట్ బాయ్ నితిన్ కూడా యాక్షన్ జోనర్‌కు కాస్త బ్రేక్ ఇస్తున్నాడు. 'భీష్మ' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వరుస ప్రయోగాలు చేసి కొంతమేర వెనకబడ్డ నితిన్, ఇప్పుడు సాలిడ్ కంబ్యాక్ కోసం నేచురల్ స్టార్ నాని సమర్పణలో 'అలియాస్ రుక్మిణి' అనే క్రేజీ ఫ్యామిలీ లవ్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 


ఈ ప్రాజెక్ట్ కోసం నితిన్ పూర్తిస్థాయి ఫ్యామిలీ మ్యాన్‌లా మేకోవర్ అయ్యాడు. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాతగా వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న నాని జడ్జ్‌మెంట్ మీద నమ్మకంతో నితిన్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. కేవలం సీనియర్ లేదా మిడ్-రేంజ్ హీరోలే కాకుండా, యంగ్ హీరోలు సైతం వైలెన్స్ చట్రం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. భీభత్సమైన వైలెన్స్ జోలికి వెళ్ళకపోయినా, కిరణ్ అబ్బవరం కూడా యాక్షన్ హీరో అనిపించుకోవాలని తెగ ప్రయత్నాలు చేశాడు. అయితే అవి పూర్తిస్థాయిలో వర్కవుట్ కాకపోయేసరికి వెంటనే యూ టర్న్ తీసుకుని 'క', 'K రాంప్', 'చెన్నై లవ్ స్టోరీ' వంటి వైవిధ్యమైన లవర్ బాయ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఒకే రకమైన యాక్షన్ జోనర్‌లో ఇరుక్కుపోకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ సాగాలని నటీనటులు అందరూ ఇప్పుడు గట్టిగా ఫిక్స్ అయ్యారు. 

ఇది కూడా చదవండి: లెజండ్రీ దర్శకుడి మృతి: కొన్ని దశాబ్దాలపాటు ప్రేక్షకులని పరిపాలించిన చక్రవర్తి! 

 


ప్రేక్షకుల పల్స్ ఎక్కడ ఉందో పక్కాగా అంచనా వేస్తున్న టాలీవుడ్ మేకర్స్, ఇప్పుడు కత్తిపోట్లు, విపరీతమైన రక్తపాతం కంటే హృదయానికి హత్తుకునే అనుబంధాలు, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తున్నారు. థియేటర్స్‌కి క్యూ కట్టే ఫ్యామిలీ ఆడియన్స్‌ను మళ్లీ వెనక్కి రప్పించడమే లక్ష్యంగా టాలీవుడ్ హీరోలు చేస్తున్న ఈ సాహసోపేతమైన మార్పు చిత్ర పరిశ్రమలో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. కేవలం ఒకరిద్దరు హీరోలకే పరిమితం కాకుండా టాలీవుడ్ వ్యాప్తంగా ఈ ట్రెండ్ కొనసాగుతుండటం విశేషం. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల జోరు రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, మన హీరోల ప్లానింగ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.

 

 

[Tollywood Heroes latest Family Entertainer movies, Tollywood heroes shift, family entertainers tollywood, Nithiin Alias Rukmini, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com