అంతా అనుకున్నట్టుగానే జరిగింది..అమితాబ్ ఫ్యామిలీకి అభిమానులు ఇచ్చి పడేసారు
on Mar 22, 2025
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)సతీమణి మాజీ నటి జయాబచ్చన్(Jaya bachchan)ఇటీవల కొంత మంది మీడియా ప్రతినిధులతో 2017 లో వచ్చిన 'టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ'(Toilet ek prem kada)మూవీ గురించి ఉద్దేశించి మాట్లాడుతు అసలు ఆ మూవీ టైటిల్ ఏంటి? అలాంటి టైటిల్ తో ఉన్న సినిమాలని చూడటానికి నేను ఏ మాత్రం ఇష్టపడను.రాజకీయ పార్టీలు ప్రచారం కోసం అలాంటి చిత్రాలని రూపొందిస్తాయి.ఇక్కడున్న వాళ్ళల్లో మీకే చాలా మందికి ఆ మూవీ నచ్చి ఉండదు.అదొక ప్లాప్ మూవీ అని చెప్పుకొచ్చింది.జయాబచ్చన్ మాట్లాడిన మాటలు బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా కూడా మారాయి.
ఈ విషయంపై టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ నిర్మాతల్లో ఒకరైన'ప్రేరణా అరోరా'(Prerana Arora)మాట్లాడుతు జయాబచ్చన్ కి నేను వీరాభిమానిని, ఆమె నటించిన ఉపహార్,అభిమాన్, మిలి లాంటి చిత్రాలని ఎన్నిసార్లైనా చూడటానికి ఇష్టపడతాను.ఇప్పుడు ఆమె మా టాయిలెట్ చిత్రాన్ని ప్లాప్ అన్నారు.కానీ బాక్స్ ఆఫీస్ వసూళ్లు చూసుండాల్సింది.2017 లో విజయాన్ని అందుకున్న బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో మా మూవీ కూడా ఒకటి.నిర్మాతగా ఎన్నో విభిన్నమైన చిత్రాలని నిర్మించుకుంటు వస్తున్నాను.అలాంటిది నా అభిమాన కథానాయిక నుంచి విమర్శలు రావడం చాలా బాధగా ఉంది.ఎంతో అలోచించి కథకి అనుగుణంగానే ఆ టైటిల్ ని నిర్ణయించామని చెప్పడం జరిగింది.
2017 లో అక్షయ్ కుమార్(Akshaykumar)భూమి ఫడ్నేకర్(Bhumi pednekar)జంటగా'టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ'ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గ్రామీణ పాంత్రాల్లోని మరుగుదొడ్ల కొరతని ఎత్తి చూపడమే కాకుండా తన భార్య కోరిక మేరకు ఒక వ్యక్తి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించడానికి ఎలాంటి కృషి చేసాడనే లైన్ తో 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ప్రేక్షకుల ఆదరణతో 300 కోట్లు దాకా వసూలు చేసింది.వయాకామ్ 18 స్టూడియోస్,క్రియార్జ్ ఎంటర్‌టైన్‌మెంట్,ఫ్రైడే ఫిలిం వర్క్స్, ప్లాన్ సీ స్టూడియోస్, కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ల పై అరుణ భాటియా,విక్రమ్ మల్హోత్రా, శీతల్ భాటియా, నీరజ్ పాండే, ప్రేరణా అరోరా(Prerana Arora)అర్జున్ ఏన్. కపూర్ నిర్మించగా శ్రీ నారాయణ్ సింగ్(Sri NarayanSingh)దర్శకత్వం వహించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
