Home

»

Latest News

ఏడాది వరకు ప్రజలు థియేటర్లకు రారేమో?

Apr 16, 2020 11:16PM

 

తెలుగు నిర్మాతలు మాత్రమే కాదు, హిందీ నిర్మాతలు సైతం ఎప్పుడు థియేటర్లు రీఓపెన్ చేస్తారోనని ఎదురు చూస్తున్నారు. హిందీలోనూ విడుదలకు సిద్ధమైన భారీ సినిమాలు ల్యాబుల్లో మగ్గుతున్నాయి. ఇటువంటి సమయంలో నటి టిస్కా చోప్రా మాటలు వింటే నిర్మాతలకు హార్ట్ ఎటాక్ రావడం ఖాయం. తెలుగులో రామ్ చరణ్ 'బ్రూస్ లీ'లో సంపత్ రాజ్ రెండో భార్యగా, పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్'లో విలన్‌తో కాజల్ పెళ్లి చేయాలని చూసే రాజకుటుంబంలో వ్యక్తిగా ఆమె నటించారు.  

"కనీసం మరో ఏడాది వరకూ ఎవరూ థియేటర్లకు రారేమో? ఎందుకంటే... ప్రస్తుతం వ్యాధి గురించి పూర్తిగా ఎవరికీ సరైన సమాచారం ఏమీ తెలియదు కదా" అని టిస్కా చోప్రా అంటున్నారు. కరోనాకి వాక్సిన్ వచ్చే వరకు ఎవరూ థియేటర్లలో అడుగుపెట్టరని ఆమె తేల్చేశారు. గాలిలో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ప్రస్తుత పరిస్థితులో తనను తానుగా ఐదు వందల మంది కూర్చున్న క్లోజ్డ్ రూమ్‌లో ఉండాలని అనుకోనని ఆమె అన్నారు. టిస్కా చోప్రా మాట్లాడుతూ "పెద్ద సినిమాలు  ఆరు నెలలు, ఏడాది ఆగుతాయి. చిన్న సినిమాల నిర్మాతలు, వడ్డీలు కట్టలేని నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాలు విడుదల చేసుకుంటారు. చాలా కంటెంట్ ఓటీటీలకు వెళుతుంది" అని టిస్కా చోప్రా అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com