'తుండు' మూవీ రివ్యూ
on Mar 17, 2024
మూవీ: తుండు
నటీనటులు: బిజు మీనన్ , షైన్ టామ్ చాకో, ఉన్నిమయ ప్రసాద్, గోకులన్, రఫీ తదితరులు
కథ: కన్నప్పన్, రియాజ్ షరీఫ్
ఎడిటింగ్: నబు ఉస్మాన్
మ్యూజిక్: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: జింషీ ఖలీద్
నిర్మాతలు: అషిఖి ఉస్మాన్ , జింషీ ఖలీద్
దర్శకత్వం: రియాజ్ షరీఫ్
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్
మలయాళ సినిమాలు ఈ మధ్య కాలంలో ఓటీటీలో తెగ సందడి చేస్తున్నాయి. బిజు మీనన్ నటించిన 'తుండు' మూవీ తెలుగు వర్షన్ తాజాగా విడుదలైంది. మరి ఈ మూవీ కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ:
పోలీసులు రోడ్డు మీద ఒక వ్యక్తిని పట్టుకొని క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు బేబి జాన్ అనే కానిస్టేబుల్ కి ప్రిన్సిపల్ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళ కొడుకు మాథ్యూ పరీక్షల్లో కాపీ కొట్టాడని, ఇంకోసారి ఇది రిపీట్ అయితే టీసీ ఇచ్చి పంపించేస్తానని ఆ కాలేజీ ప్రిన్సిపల్ బేబికి చెప్తుంది. ఇక అదే సమయంలో బేబి ఒకతడిని ఆటోతో ఢీకొట్టడంతో అతనిని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఇక మాథ్యూ, బేబీ కలిసి ఇంటికెళ్తారు. అలా కొన్ని రోజులకి తన స్టేషన్ లో ఉండే శిగిన్ కి బేబి అంటే ఇష్టముండదు. అతను బేబీ ఎక్కడ దొరుకుతాడో అని ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో బేబీ ఏఎస్పీ కోసం పరీక్షలు రాస్తుంటాడు. మరి శిగిన్, బేబిల మధ్య గొడవేంటి? బేబి ఎగ్జామ్ లో పాస్ అయ్యాడా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
ప్రిన్సిపల్ నుండి ఫోన్ రావడంతో కాలేజీకి వెళ్ళిన బేబి కామ్ అండ్ కూల్ గా డీల్ చేస్తాడు. తప్పు ఇంకోసారి చేయకూడదని నాన్న బేబి కొడుకు మాథ్యూకి చెప్పడంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. అయితే స్టేషన్ లో బేబికి ఇచ్చే వాల్యూ బాగున్నప్పటికి అతడు ఏం చేసినా కామెడీ రావాలని కావాలని ఆటోతో ఒకరిని ఢీకొట్టడం లాంటివి బలవంతంగా నవ్వు తెప్పించేవిలా ఉంటాయి.
కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో పెద్దగా కామెడీ లేకపోగా ఏదీ సీరియస్ గా ఉండదు. పోలీసులు పరీక్షల్లో కాపీ కొట్టడమేంటో వినడానికే కొత్తగా ఉన్నా అదీ అంతగా నవ్వు తెప్పించలేకపోయింది. ఇక సినిమా అంతా కొడుకు ఎగ్జామ్ లో కాపీ చేయడం, తండ్రి పోలీస్ పరీక్షలో కాపీ చేయడం అంతా కూడా ఒక ఫ్లోలో అలా వెళ్లిపోతుంది. అయితే ఇందులో కథేంటో వెతకాలంటే కథలు కథలుగా చెప్పుకోవాలి. ఏది పెద్దగా కనెక్ట్ అవ్వదు. బిజు మీనన్ స్క్రీన్ ప్రెజెన్స్ తప్ప ఎక్కడా పెద్దగా ఎంగేజింగ్ గా అనిపించలేదు.
వేసవిలో ఎండలో తిరొగొచ్చి బాడీ చల్లదనం కోసం తుండుగుడ్డ ఎలా వేసుకుంటామో.. అచ్చం అలాగే సినిమా మొత్తం చూసొచ్చాక తల హీటెక్కి తుండుగుడ్డ వేసుకొని పడుకోవడం ఖాయం. ఫ్యామిలీ ఎమోషన్స్ జీరో.. కథనం జీరో.. వహ్వా అనిపించేలా ఏది లేదు. పరీక్షల్లో కాపీ కొట్టే సీన్స్ ని జపాన్ వాళ్ళు ఓ అయిదారేళ్ళ క్రితం తీస్తే వీళ్ళూ ఆ మూవీలోని సీన్లని ఇప్పుడు కాపీ చేసుకున్నట్లుగా తెలిసిపోతుంది. ఇక సినిమా మొత్తంలో ఏదైనా బాగుందంటే.. జింషీ ఖలీద్ సినిమాటోగ్రఫీ.. జిజు మీనన్ స్క్రీన్ మీద చక్కగా చూపించారు. ఈ స్టోరీకి గంట కూడ చాలా ఎక్కువ కానీ సుమారుగా రెండు గంటల నిడివి అనవసరం. నబు ఉస్మాన్ ఎడిటింగ్ లో కాస్త ట్రిమ్ చేస్తే బాగుండు. గోపి సుందర్ బిజిఎమ్ కొన్ని చోట్ల బాగుంది. మరికొన్ని సీన్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
బేబి జాన్ పాత్రలో బిజు మీనన్ ఒదిగిపోయాడు. శిగిన్ పాత్రలో షిన్ టామ్ చాకో ప్రధాన బలంగా నిలిచాడు. ఉన్నిమయ ప్రసాద్, గోకులన్ బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఇచ్చారు. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా..
కామెడీ అని ఎక్స్ పెక్ట్ చేసి చూడాలనుకుంటే 'తుండు' గుడ్డ వేసుకొని పడుకోవాల్సిందే.
రేటింగ్: 2/5
✍️. దాసరి మల్లేశ్

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
