Home

»

Latest News

ఈ ఏడాది `వ‌కీల్ సాబ్`.. వ‌చ్చే సంవ‌త్స‌రం `స‌ర్కారు వారి పాట‌`..!

Nov 27, 2021 3:46PM

చార్ట్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్స్ తో తెలుగునాట సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నారు త‌మ‌న్. ఒక‌వైపు బిగ్ టికెట్ ఫిల్మ్స్ కి బాణీలు అందిస్తూనే.. మ‌రోవైపు మీడియ‌మ్, లో బ‌డ్జెట్ మూవీస్ కి కూడా స్వ‌రాలు స‌మ‌కూర్చుతూ ముందుకు సాగుతున్నారు ఈ స్టార్ కంపోజ‌ర్. `అఖండ‌`, `భీమ్లా నాయ‌క్`, `గాడ్ ఫాద‌ర్`, `స‌ర్కారు వారి పాట‌`, `#SSMB28`, `#RC15`.. ఇలా ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఏడాది గ్యాప్ లో సంద‌డి చేయ‌బోతున్నారు ఈ స్వ‌ర చిచ్చ‌రపిడుగు.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది త‌మ‌న్ కి విజ‌యాన్ని అందించిన చిత్రాల్లో `వ‌కీల్ సాబ్` ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ఈ సినిమా ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న విడుద‌లై వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. క‌ట్ చేస్తే.. వ‌చ్చే సంవ‌త్స‌రం అదే ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని త‌మ‌న్ అప్ క‌మింగ్ ప్రాజెక్ట్స్ లో ఒక‌టైన `స‌ర్కారు వారి పాట‌` కూడా రిలీజ్ కానుంది. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. 2022 ఉగాది కానుక‌గా ఏప్రిల్ 1న థియేట‌ర్స్ లోకి రాబోతోంది. మ‌రి.. `వ‌కీల్ సాబ్` త‌ర‌హాలో `స‌ర్కారు వారి పాట‌` కూడా విజ‌యం సాధించి త‌మ‌న్ ఖాతాలో మ‌రో ఉగాది హిట్ ని చేరుస్తుందేమో చూడాలి.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com