అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి.. ఈ సంక్రాంతి సీనియర్లదే..!
on Jan 15, 2025
ఈ సంక్రాంతికి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'డాకు మహారాజ్', వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగాయి. రామ్ చరణ్ ప్రజెంట్ జనరేషన్ టాప్ స్టార్స్ లో ఒకడు కావడంతో.. ఈ సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్' (Game Changer) హవా ఎక్కువ ఉంటుందని అందరూ భావించారు. కానీ రిజల్ట్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. 'గేమ్ ఛేంజర్' మొదటి షో నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. వసూళ్లు రోజురోజుకి పడిపోతున్నాయి. భారీ థియేట్రికల్ బిజినెస్ కారణంగా ఈ చిత్రం భారీ నష్టాలను చూసే అవకాశముంది. మరోవైపు సీరియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్ నటించిన 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొని, మంచి వసూళ్లతో సంక్రాంతి విన్నర్ రేస్ లో దూసుకుపోతున్నాయి.
జనవరి 12న విడుదలైన 'డాకు మహారాజ్' (Daaku Maharaaj) సినిమా, మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.56 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం. మాస్ మెచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే ఎమోషన్స్ ఉండటంతో ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. దీంతో 'డాకు మహారాజ్' మూవీ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.92 కోట్ల గ్రాస్ సాధించింది. ప్రస్తుత జోరు చూస్తుంటే.. నాలుగు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి.. ఫుల్ రన్ లో రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టిన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam) కూడా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.45 కోట్ల గ్రాస్ రాబట్టి, వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సంక్రాంతికి సరైన సినిమా కావడంతో దాదాపు షోలు అన్నీ ఫుల్ అవుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే.. ఈ సినిమా కూడా ఫుల్ రన్ లో రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.
మరి 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలలో ఫుల్ రన్ లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.
Also Read