అప్పుడే ఓటిటి లోకి రాజాసాబ్.. ఫ్యాన్స్ కి పండగే
on Jan 28, 2026

-జియో హాట్ స్టార్ రాజా సాబ్ ని ఎప్పుడు తెస్తుంది!
-సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఓటిటి అప్డేట్
-మరి రాజా సాబ్ ఈ సారైనా రికార్డులు కొడతాడా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్(The Raja saab)గా అభిమానులని, ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకొని విషయం తెలిసిందే. ప్రభాస్ కట్ అవుట్ కి తగట్టుగా కలెక్షన్స్ ని కూడా రాబట్టలేకపోయింది. కథ ఉద్దేశ్యం మంచిదే అయినా మారుతీ(Maruthi)నుంచి వచ్చిన కథనాలు ఆకట్టుకోలేని విధంగా ఉండటమే రాజా సాబ్ కి ప్రధాన మైనస్ గా నిలిచాయనే మాటకి మెజారిటీ బాక్స్ ఆఫీస్ ఆమోద ముద్ర వేసింది. మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ నోటి నుంచి వచ్చిన తాత వైర్ కొరికేసాడురా అనే డైలాగ్ అభిమానులు, ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లి ఉండటం, ప్రభాస్ ఓల్డ్ గెటప్ ని చూపించడంతో అందరు ప్రభాస్ డ్యూయల్ రోల్ అనుకున్నారు.
దీంతో రాజా సాబ్ పై అంచనాలు పీక్ లో ఏర్పడ్డాయి.కానీ రిలీజ్ కి దగ్గర్లో నాయనమ్మ, మనవడు కథ అని మేకర్స్ చెప్పడం మైనస్ గా పరిగణించిందనే మాటలు ట్రేడ్ వర్గాల్లో వినిపించాయి. ఇలాంటి కారణాలు కూడా రాజాసాబ్ ని డిజాస్టర్ దిశగా మళ్ళించాయనే మాటలు అభిమానుల నుంచి వినిపించాయి. రీసెంట్ గా రాజా సాబ్ ఓటిటి డేట్ ఇదేనంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఓటిటి డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
ఎన్నో సంస్థల పోటీ మధ్య రాజాసాబ్ ఓటిటి రైట్స్ ని జియో హాట్ స్టార్(Jio Hotstar)భారీ అమౌంట్ కి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్థ ఫిబ్రవరి రెండో వారంలో రాజా సాబ్ ని స్ట్రీమింగ్ కి ముస్తాబు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.సదరు డేట్ పై కూడా హాట్ స్టార్ ఒక క్లారిటీ ఇవ్వనుందని అంటున్నారు. మరి ఈ లెక్కన మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 15 న ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.
Also read: గుణశేఖర్ కి మహేష్ బాబు వార్నింగ్.. ఫ్యాన్స్ ఎవర్ని సపోర్ట్ చేస్తారు
రాజా సాబ్ కి సంబంధించిన మిగతా విషయాలని చూసుకుంటే ప్రభాస్ తో నిధి అగర్వాల్(Nidhhi Agarwal),మాళవిక మోహన్(Malavika MOhan),రిద్ది కుమార్(Riddi Kumar)జత కట్టి ఫ్రేమ్ కి మరింత కాంతులు తెచ్చారు. కాంప్రమైజ్ కానీ పీపుల్ మీడియా నిర్మాణ విలువలు రాజాసాబ్ కి ప్రధాన బలంగా నిలిచాయి. థమన్ ఇచ్చిన సాంగ్స్ లో మెరుపులు లేకపోయినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం మెప్పిస్తుంది .మరి థియేటర్స్ లో సంచలన రికార్డుకి కిలోమీటర్ల దూరంలో నిలిచిన రాజా సాబ్ ఓటిటి లో అయినా సంచలన రికార్డులని తన పక్కనే ఉంచుకుంటాడేమో..

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



