ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
on Jan 6, 2025
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)నుంచి 'కల్కి 2898 ఏడి'(Kalki 2898 ad)తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోయే మూవీ ది రాజా సాబ్'.(The Raja Saab).ప్రభాస్ ఫస్ట్ టైం హార్రర్ కామెడీ చేస్తుండంతో రాజాసాబ్ పై అభిమానుల్లోను,ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.నిధి అగర్వాల్(Nidhi Agarwal)మాళవిక మోహనన్(Malavika Mohanan) హీరోయిన్లు గా చేస్తున్న ఈ మూవీకి మారుతీ(Maruthi)దర్శకుడు కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజె విశ్వ ప్రసాద్(Tj Viswa prasad)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్ డేట్స్ ని చిత్ర బృందం వెల్లడి చేసింది.
సంగీత దర్శకుడు థమన్(Thaman)ఆధ్వర్యంలో ప్రస్తుతానికి నాలుగు పాటలని సిద్ధం చెయ్యగా,ఆ నాలుగు సాంగ్స్ కూడా వైవిధ్యమైన థీమ్స్ తో డిజైన్ చేసారంట.వీటిల్లో మెలోడీస్ తో పాటు మాస్ బీట్ ఉన్న సాంగ్ కూడా ఉంది.భారీ హంగులతో అద్భుతమైన లొకేషన్స్ లో ప్లాన్ చేస్తున్నామని కూడా చెప్పారు. ప్రభాస్ కూడా ఇందుకు పూర్తి సమయం కేటాయించాడని,ప్రస్తుతం వొకేషన్ లో ఉన్న ప్రభాస్ అది పూర్తయిన వెంటనే సెట్స్ లోకి అడుగుపెడతాడని కూడా చిత్ర బృందం వెల్లడి చేసింది.ఫిబ్రవరి చివరి నాటికి లేదా మార్చి మొదటి వీక్ కి 'రాజాసాబ్' ని పూర్తి చెయ్యాలనే లక్ష్యంగా ప్రభాస్ పెట్టుకున్నాడని కూడా అంటున్నారు.ఈ మూవీ కంప్లీట్ అయ్యాకే ప్రభాస్ తన తదుపరి సినిమాల షూటింగ్ లో పాల్గొంటాడనే మాటలు కూడా వినపడుతున్నాయి.'రాజాసాబ్' వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 10 న విడుదల కాబోతుంది.
ప్రభాస్ లిస్ట్ లో ప్రశాంత్ నీల్(Prashanth neel)దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ 2 ,సందీప్ రెడ్డి వంగ(Sundeep reddy vanga)స్పిరిట్, హను రాఘవపూడి(Hanu Raghavapudi)సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.
Also Read