నా బాయ్ఫ్రెండ్లో ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే?
on Apr 9, 2020
తెలుగు సినిమా ప్రేక్షకులు, అభిమానులు 'బంగారమ్స్' అంటోంది నిధి అగర్వాల్. 'ఇస్మార్ట్ శంకర్'తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ అందాల భామ, ట్విట్టర్లో కాసేపు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తనకు క్రికెట్ అంటే ప్రేమ అని చెప్పుకొచ్చింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు నిధి అగర్వాల్ ఏం సమాధానాలు ఇచ్చారో చదవండి.
• మీరు సింగిల్ గా ఉన్నారా?
ఎస్.. అయామ్ సింగిల్ (ప్రేమలో లేను అని)
• మీ బాయ్ఫ్రెండ్లో ఉండాల్సిన క్వాలిటీ?
అతడు చాలా సరదాగా (ఫన్నీగా) ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్.
• లవ్ మ్యారేజ్? అరెంజ్డ్ మ్యారేజ్?
అరెంజ్డ్ మ్యారేజ్. పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధం చేసుకుంటా.
• తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ మీకు పోటీ అనుకుంటున్నారు?
తెలుగులో టాలెంటెడ్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే... మనకి మనతోనే పోటీ ఉంటుంది. ప్రతి ఒక్కరికీ వాళ్ల లక్ష్యం, ప్రయాణం ఉంటాయి.
• పవర్ స్టార్ (పవన్ కళ్యాణ్) గురించి ఒక్క మాట?
పవన్ కళ్యాణ్ సార్ సినిమాకి ఒక గిఫ్ట్.
• మీకు సూపర్ పవర్ ఉంటే ఏం చేస్తారు?
ప్రస్తుతం నాకే గనక సూపర్ పవర్ ఉంటే కరోనా వైరస్ ను నయం చేస్తా.
• మీకు జంతువులు అంటే ఇష్టమా?
ప్రేమ. మూగ జంతువుల హక్కులు, సంరక్షణకు సంబంధించిన పనులు కోసం ఏమైనా చేయాలనుంది. జంతువులకు సంబంధించిన మంచి పనులతో అసోసియేట్ కావాలని ఉంది.
Also Read