తండేల్ సెన్సార్ టాక్.. సెకండాఫ్ లో..?
on Jan 30, 2025
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన మూవీ 'తండేల్'. 'థాంక్యూ', 'కస్టడీ' పరాజయాల తర్వాత నాగ చైతన్య నుంచి వస్తున్న సినిమా కావడంతో.. 'తండేల్'తో చైతన్య కమ్ బ్యాక్ ఇవ్వాలని అక్కినేని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే 'తండేల్'పై మంచి అంచనాలు ఉన్నాయి. 'కార్తికేయ-2' వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత చందు మొండేటి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. 'లవ్ స్టోరీ' తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన 'తండేల్' సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. (Thandel)
'తండేల్'కి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా ఫైనల్ రన్ టైంని 2 గంటల 32 నిమిషాలుగా లాక్ చేశారు. ఇక ఈ మూవీ సెన్సార్ టాక్ పాజిటివ్ గానే ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్న ఈ కథను దర్శకుడు చందు మొండేటి తెరమీదకు తీసుకువచ్చిన విధానం బాగుందని అంటున్నారు. ప్రేమ కథను, దేశభక్తిని ముడిపెడుతూ హృదయానికి హత్తుకునేలా సినిమాని మలిచాడని చెబుతున్నారు. చైతన్య, సాయి పల్లవి మధ్య ప్రేమ సన్నివేశాలు, జాతర ఎపిసోడ్, ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టి పడేస్తాయని టాక్. దేశభక్తితో ముడిపడిన సినిమా కావడంతో, ఎమోషన్స్ వర్కౌట్ అయితే.. తెలుగులోనే కాకుండా, హిందీలో కూడా ఈ సినిమా మంచి ఆదరణ పొందే అవకాశముంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
