మీసం తిప్పి చెప్తున్నా.. ఓజీ వాటన్నిటికీ సమాధానం ఇస్తుంది
on Jan 14, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అప్ కమింగ్ మూవీ ఓజీ(OG)కి ఉన్న క్రేజ్ గురించి అందరకి తెలిసిందే. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ లో అయితే ఓజి మీద అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఎంతలా అంటే పవన్ ఏ మీటింగ్ కి వెళ్లినా సరే ఓజీ అని అరిచేంతలా.
సుజిత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి థమన్(THaman) సంగీత దర్శకుడనే విషయం తెలిసిందే. రీసెంట్ గా థమన్ ఓజీ గురించి మాట్లాడుతు మీసం తిప్పి మరీ చెప్తున్నాను ఓజీ సినిమా అన్నిటికీ సమాధానం ఇస్తుందని అన్నాడని, తమిళ సినిమా నుంచి లియో, బీస్ట్, విక్రమ్, జైలర్ లాంటి సినిమాలు ఎలాగో, వాటన్నిటికీ సమాధానం ఇచ్చేలా ఓజీ ఉంటుంది. వాళ్ళ సినిమాలు కోసం మనం ఎలా మాట్లాడుకున్నామో ఓజీ కోసం మిగతా వాళ్ళు మాట్లాడుకునే రేంజ్ లో కూడా ఉంటుందనే వ్యాఖ్యలు థమన్ చేసాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ లో అయితే ఈ వార్త సరికొత్త జోష్ ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు.
పవన్ అప్ కమింగ్ జాబితాలో ఉన్న సినిమాల్లో ముందుగా 'ఓజీ' నే విడుదలవ్వుతుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో హరిహరవీరమల్లు వచ్చి చేరింది. ప్రస్తుతం రెగ్యలర్ గా షూటింగ్ ని జరుపుకుంటున్న వీరమల్లు మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక ఓజీ ని ఆర్ఆర్ఆర్ దానయ్య నిర్మిస్తుండగా ప్రియాంక మోహన్, శ్రీయారెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
Also Read