'పుష్ప' 5వ షోకు అనుమతినిచ్చిన తెలంగాణ ప్రభుత్వం
on Dec 16, 2021

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప' మూవీకి తెలంగాణ ప్రభుత్వం 5వ షోకు అనుమతి జారీ చేసింది. రష్మిక మందన్న నాయికగా నటించిన ఈ సినిమా రేపు (డిసెంబర్ 17)న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతినిచ్చిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా సినిమా విడుదలైన రోజు నుంచి రెండు వారాల పాటు థియేటర్లలో 5వ షో వేసుకోవడానికి అనుమతినిస్తూ జీవో జారీ చేసింది.
Also read: సమంత సాంగ్ కాంట్రవర్సీపై రెస్పాండ్ అయిన అల్లు అర్జున్!
కాగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇందుకు విరుద్ధమైన వాతావరణం నెలకొని ఉండటం తెలిసిందే. అక్కడ టిక్కెట్ ధరలు పెంచడానికి బదులు తగ్గించడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎగ్జిబిటర్లు హైకోర్టుకు వెళ్లడంతో, టిక్కెట్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసిన న్యాయస్థానం, పాత ధరలకే టిక్కెట్లు అమ్మాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సమీక్షించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లింది.
Also read: 'పుష్ప' కోసం శేషాచలం ఎర్రచందనాన్ని మారేడుమిల్లి అడవుల్లో సృష్టించింది ఈ జంటే!
ఇంతే కాదు, బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం నిరాకరిస్తూ వస్తోంది. ఏపీ ప్రభుత్వ ధోరణి కారణంగా అక్కడ థియేటర్లు నడపలేని పరిస్థితి తలెత్తుతోందని పలువురు నిర్మాతలు వాపోతున్నారు. అదే జరిగితే, థియేటర్లపై ఆధారపడి బతుకున్న వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



