ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. బెనిఫిట్ షోలపై ఏమన్నారంటే..?
on Dec 26, 2024
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఇండస్ట్రీకి చెందిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు.. ఇలా 36 మంది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినీ ఇండస్ట్రీ గురించి, రాష్ట్రంలో శాంతి భద్రతల గురించిన అంశాలపై చర్చించారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినీ ప్రముఖులు లేవనెత్తిన ముఖ్యమైన పాయింట్స్ ఇవే..
ఇకపై బెనిఫిట్ షోలు ఉండవన్న సీఎం
ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పిన సీఎం రేవంత్
అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్న రేవంత్
శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్
ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామన్న సీఎం
అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే..!
ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చిన సీఎం
తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి..
డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి..
టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి..
ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి..
ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చిన సీఎం
సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం
ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే..
తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందన్న సీఎం రేవంత్
ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది డ్రీమ్. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు..
హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలి
- సురేష్‌బాబు
అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది. దిల్ రాజును ఎఫ్డిసి ఛైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నాను. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నాం
- రాఘవేంద్రరావు
యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలి. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక.
- నాగార్జున
ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుంది. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది. సినిమా రిలీజ్లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నాం.
- మురళీమోహన్
Also Read