నటుడు తారకరత్నకు రూ.700 ఫైన్..!
on Apr 11, 2016

మొన్నీ మధ్యే కారుకు బ్లాక్ టింట్ ఉన్నందుకు, ఎన్టీఆర్ కు పోలీసులు జరిమానా విధించారు. లేటెస్ట్ గా మరో నందమూరి వారసుడికి కూడా మళ్లీ ఫైన్ వేశారు. జూబ్లీహిల్స్ జంక్షన్లో పోలీసులు బ్లాక్ టింట్ కార్స్ చెకింగ్ కోసం తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటువైపుగా వస్తున్న తారకరత్న కారును ఆపి బ్లాక్ టింట్ గురించి ప్రశ్నించారు. దాన్ని తొలగిస్తానని ఆయన వివరణ ఇచ్చిన తర్వాత 700 రూపాయలు ఫైన్ వేసి పోలీసులు బ్లాక్ టింట్ ను తొలగించారు. కాగా, తారకరత్న విలన్ గా చేసిన రాజా చెయ్యి వేస్తే మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 29న ఈ మూవీ రిలీజ్ అవుతోందని నారా రోహిత్ ప్రకటించాడు. ఈ మూవీపైనే తారకరత్న ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమా బాగుంటే విలన్ గా మరిన్ని అవకాశాలు తారకరత్న తలుపు తడతాయనడంలో డౌట్ లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



