మెగా హీరో సినిమాలో తారక్ విలన్ గా చేస్తాడా..?
on May 3, 2016

ఒకేసారి 9 సినిమాలు సైన్ చేసిన ఒక అగ్రకుటుంబపు హీరో, ఆ తర్వాత సినిమా అవకాశం కోసం ఎదురుచూసే పరిస్థితి వస్తుందని ఎవరైనా అనుకుంటారా..కానీ తారకరత్నకు అదే జరిగింది. ఒకే సారి పైకి కెరటంలా లేచిన తారకరత్న కెరీర్, అంతే వేగంగా కిందికి వచ్చేసింది. కేవలం దశాబ్దకాలంలోనే ఎన్నో ఎత్తు పల్లాలను చూశాడు తారక్. హీరోగా కలిసిరాకపోవడంతో, అమరావతితో విలన్ పాత్రకు షిఫ్ట్ అయిన తారక్ కు అమరావతి మంచి పేరుతో పాటు నంది అవార్డును కూడా తీసుకొచ్చింది. ఈ సారి రాజా చెయ్యి వేస్తే సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు తారకరత్న. ప్రస్తుతం పరభాషా విలన్లని తెచ్చుకుంటున్న ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్ గా తారకరత్న ఉపయోగం చాలా ఉంది. రాజా చెయ్యి వేస్తే లో రోహిత్ కంటే తారక్ కే ఎక్కువ పేరొచ్చిందంటే ఆశ్చర్యం లేదు. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాలో విలన్ పాత్రకు తారక్ ను తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గోపిచంద్ మలినేని, సాయి ధరమ్ కాంబోలో రాబోతున్న చిత్రానికి విలన్‌గా తారకరత్నను తీసుకునే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందని అంటున్నారు. నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య ప్రొఫెషనల్ గా ఎలాంటి పోటీ ఉందో తెలిసిందే. ఇప్పుడు ఇద్దరు కలిసి సినిమా చేస్తే మాత్రం, ఒక ఆరోగ్యకర వాతావరణానికి తెరతీస్తారనడంలో సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



