తమన్నా సినిమా అయిపోయిందా..?
on Nov 22, 2016

అదృష్టముంటే ఏడారిలో కూడా బతికేయొచ్చంటారు... ఆ విషయం తమన్నాకి బాగా సూట్ అవుతుంది. కెరిర్ ప్రారంభం నుంచి నేటిదాకా ఈ అమ్మడు చాలా సినిమాలు చేసింది..కానీ వాటిలో హిట్లు మెట్లెక్కినవి ఒకటో..రెండో. కాని సుడి ఓ రేంజ్‌లో ఉండటంతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. కానీ అదృష్టం అన్ని వేళలా పని చేయదు కదా..? ఇప్పుడు అదే స్థితిలో ఉంది తమన్నా. కొత్త అందాల రాకతో తమన్నా అందం పాతదైపోయింది. రకుల్ ప్రీత్ సింగ్, కిర్తీ సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లాంటి వారు చేతిలో రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉంటే మిల్కీ బ్యూటీ మాత్రం ఒక్క మూవీతో ఉంది.
అదే ఎస్ఎస్ రాజమౌళి ప్రస్టేజియస్ మూవీ బాహుబలి-2. ఇందులో తమన్నాది సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్. బాహుబలి-1లో అందాల అరబోతతో ఆకట్టుకున్న తమన్నాకి బాహుబలి-2లో అనుష్క తన అందంతో చెక్‌పెట్టనుందట. సో దీని తర్వాత ఏ దర్శకనిర్మాత తమన్నాని సంప్రదించినట్లు వార్తలు లేవు. పైగా తాను లీడ్ రోల్ చేసి ఎన్నో ఆశలు పెట్టుకున్న అభినేత్రి అట్టర్ ఫ్లాప్ కావడంతో మిల్కీబ్యూటీ కెరీర్ డైలమాలో పడింది. దీంతో ఇప్పటికే గోల్డ్ బిజినెస్‌లో ఉన్న తమన్నా..వీలైతే తన పూర్తి సమయాన్ని అటువైపే పెట్టే ఛాన్సుంది అంటున్నారు విశ్లేషకులు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



