సూర్య వర్సెస్ దుల్కర్... లేడీ మల్టీస్టారర్!
on Jul 29, 2023

లేడీ డైరక్టర్లు ఒక్క స్టార్ హీరోనే హ్యాండిల్ చేయడం కష్టం అనే మాట ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. మాధవన్, వెంకటేష్, సూర్యతో సినిమాలు చేసి, తన సత్తా ప్రూవ్ చేసుకున్నారు సుధ కొంగర. ఇప్పుడు అక్షయ్‌కుమార్‌తోనూ సినిమా చేస్తున్నారు. ఆకాశం నీ హద్దురా సినిమా హిందీ వెర్షన్ కంప్లీట్ కాగానే, సౌత్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్‌కు ప్లాన్ చేస్తున్నారు సుధ కొంగర. సూరరై పోట్రు సినిమాతో సూర్య బ్యానర్‌ని నేషనల్ అవార్డుల లిస్టులో నిలబెట్టిన ఘనత ఆమెది. అందుకే ఆమె వర్క్ మీద, కమిట్‌మెంట్ మీద సూర్యకి అపారమైన నమ్మకం. వెంటనే కాల్షీట్ ఇచ్చేశారు. జీవీ ప్రకాష్ ఈ మూవీకి మ్యూజిక్ చేస్తున్నారు. ఆయన మ్యూజిక్ చేసే 100వ సినిమా ఇది. ఈ చిత్రంలోనే దుల్కర్ సల్మాన్ మరో హీరోగా నటిస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దుల్కర్ సల్మాన్‌కి నచ్చిన హీరో సూర్య. మీ ఫేవరేట్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురైనప్పుడు `సూర్య... సూర్య అన్నా` అంటూ దుల్కర్ చెప్పిన సమాధానం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. వీటన్నిటినీ బట్టి సూర్య అండ్ దుల్కర్ సినిమా చేస్తే నెక్స్ట్ లెవల్లో ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నుంచి సుధ కొంగర సినిమా షూటింగ్ ఉంటుంది. అయితే ముందు సెట్‌కి సూర్య వస్తారా? దుల్కర్ వస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
నేషనల్ అవార్డ్ విన్నర్ సూర్య చేతిలో ఇప్పుడు లెక్కకుమిక్కిలి సినిమాలున్నాయి. అవి కూడా చిన్నా చితకా సినిమాలు కాదు. అన్నీ పెద్ద పెద్ద సినిమాలే. ప్రస్తుతం దరువు శివ దర్శకత్వంలో కంగువ చిత్రంలో నటిస్తున్నారు సూర్య. ఈ ఎగ్జయిటింగ్ ఫాంటసీ సినిమాను త్రీడీలో 10 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఒకటీ,రెండూ కాదు, చాలా వేషాల్లో కనిపిస్తారట సూర్య. ఈ ఏడాది అక్టోబర్‌కి కంగువకు సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయి. అందువల్ల ఇయర్ ఎండింగ్ నుంచి సుధకి అందుబాటులో ఉంటారంటున్నారు సన్నిహితులు. అటు దుల్కర్‌కి కూడా చేతినిండా సినిమాలున్నాయి. అయినా సరే, సూర్య ప్రాజెక్ట్ అనేసరికి, కాల్షీట్లను సర్దుతున్నారట హీరో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



