చెన్నైకి ఇప్పుడప్పుడే వెళ్ళదంట..సూర్య, శివకుమార్ లకి గొడవ జరిగిందా!
on Mar 15, 2024
సూర్య, జ్యోతిక ల జంటని చూసిన ఎవరైనా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనాల్సిందే. ఆ ఇద్దరి పెళ్లి జరిగి దశాబ్దంన్నర పైనే అవుతుంది. ఎలాంటి గొడవలు గాని మనస్పర్థలు గాని రాలేదు. కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి ఆ ఇద్దర్ని చూపించి భార్య భర్త అంటే ఇలా ఉండాలని చెప్పిన వాళ్ళు కూడా లేకపోలేదు. తాజాగా ఈ ఇద్దరకీ సంబంధించి వస్తున్న న్యూస్ ఒకటి హాట్ టాపిక్ అయ్యింది.
సూర్య ,జ్యోతిక లు ఇటీవలే ముంబై కి షిఫ్ట్ అయ్యారు. పిల్లల చదువుల కోసమే అక్కడ ఉంటున్నామని చెప్తున్నారు. కానీ కుటుంబ కలహాల నేపథ్యంలోనే ముంబై కి మకాం మార్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య కి తన తండ్రి శివ కుమార్ కి మధ్య గొడవ జరిగిందని అందుకే అక్కడ ఉంటున్నారని అంటున్నారు. ఈ విషయం అటు ఉంచితే ఇక ఇప్పుడు చెన్నై కి సూర్య వెళ్లి వస్తున్నాడు గాని జ్యోతిక మాత్రం వెళ్లడం లేదు. రీసెంట్ గా ఆమె సోదరి ఒక శుభకార్యం నిమిత్తం జ్యోతిక ని చెన్నై కి రమ్మని చెప్పింది. అప్పుడు కూడా జ్యోతిక వస్తానని చెప్పలేదంట. పైగా విముఖుత కూడా చూపించిందని అంటున్నారు. దీంతో సూర్య కూడా నీకు ఇష్టం ఉంటేనే ఫంక్షన్ ని వెళ్ళు లేకపోతే లేదని అన్నాడంట.దీన్ని బట్టి జ్యోతిక ఎంత పట్టుదలతో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
ఇక సూర్య ప్రస్తుతం కంగువాతో పాటు వాడి వసూల్ చిత్రాల్లో నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో కంగువా విడుదల కాబోతుంది.ఇక జ్యోతిక కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ బిజీగా మారింది. తమిళంతో పాటు మలయాళ,హిందీ, భాషల్లో కూడా నటించడానికి సిద్ధం అవుతుంది. వాటి వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి. ఈ ఇద్దరకీ ఒక కొడుకు కూతురు ఉన్నారు. ఆ ఇద్దరి పేర్లు దియా అండ్ దేవ్.