ప్రభాస్ 'కల్కి'పై సూపర్ స్టార్ కామెంట్స్!
on Jun 29, 2024
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన 'కల్కి 2898 AD' సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ పై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా 'కల్కి' చిత్రం అద్భుతంగా ఉందని కొనియాడారు.
కల్కి సినిమా గురించి తాజాగా రజినీకాంత్ ట్వీట్ చేశారు. "కల్కి సినిమా చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇండియన్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. నా మిత్రుడు అశ్వనీదత్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే తో పాటు మూవీ టీం అందరికీ శుభాకాంక్షలు. పార్ట్ 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను." అని ట్వీట్ లో పేర్కొన్నారు.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)