రజనీ "కబాలి"కి అరుదైన గౌరవం..
on Jun 26, 2016

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. టీజర్‌తో మొదలుకొని ఫ్రీ రిలీజ్ బిజినెస్ వరకు రికార్డుల మీద రికార్డులు లిఖిస్తున్న కబాలికి మరో అరుదైన ఘనత దక్కింది. ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రఖ్యాత "రెక్స్ సినిమాస్" ఆడిటోరియంలో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ సినిమాగా కబాలి చరిత్రలో నిలిచిపోనుంది. 2 వేల మందికి పైగా కూర్చునే సదుపాయం కలిగిన ఈ థియేటర్‌లో భారీ తెరపై సినిమా చూడటం గొప్ప అనుభూతి కలిగిస్తుంది. కబాలి రిలీజ్ కావడానికి ఒక రోజు ముందుగానే "రెక్స్ సినిమాస్"లో ప్రీమియర్ షో ఉంటుందని సమాచారం. ఇక్కడ ఇంకో గిఫ్ట్ ఏంటంటే..ఈ ప్రీమియర్ షోకి రజనీ హాజరయ్యే అవకాశం కూడా ఉంది. సో తలైవర్ ఫ్యాన్స్‌కి రెండు గిఫ్ట్‌లన్నమాట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



