వినాయక నిమజ్జనంలో శ్రీమంతుడి తనయుడు..
on Sep 8, 2016
ఒక సూపర్‌స్టార్ కొడుకు ఎలా ఉంటాడు..విలాసవంతమైన ఇంట్లో, కాలికి మట్టి అంటకుండా చూసుకునే పరివారం ఇది ఆ యువరాజు వైభోగం. కానీ దీనికి కంప్లీట్ డిఫరెంట్ టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్. మిగిలిన సెలబ్రెటిల పిల్లలు పెరిగి హీరోలుగా ఎంట్రీ ఇచ్చే టైంలోనే జనానికి తెలిసేవారు కాని గౌతమ్, సితారలని చిన్నప్పటి నుంచే ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు మహేశ్. తెలుగు, సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా వీరిద్దరిని పెంచుతున్న మహేశ్, నమ్రతలు ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తాజాగా గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో గౌతమ్ పాల్గొన్న ఫోటోను ఇటీవలే పోస్ట్ చేశారు. తలకు గణపతి బప్పా మోరియా అనే బ్యాండ్ కట్టుకున్న గౌతమ్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రజంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.