సన్నీ షారుఖ్ గురించి తెగ ఫీలైపోతోంది..!
on Apr 23, 2016

సన్నీ లియోన్ పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీకి వస్తానని ఆమె అసలు అనుకోలేదు. ఒక వేళ వచ్చినా ఇప్పుడున్నంత క్రేజ్ వస్తుందని ఊహించలేదు. అలాంటి సన్నీ లియోన్ కు బాలీవుడ్ బాద్ షా గా పేరొందిన షారుఖ్ తో డ్యాన్స్ చేయడమంటే కల నిజమైనట్లే. స్టార్ హీరోయిన్స్ కూడా ఈ ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఆ సువర్ణావకాశం సన్నీకి రయీస్ సినిమా రూపంలో వచ్చింది. మూవీలో ఒక స్పెషల్ సాంగ్ కోసం కింగ్ ఖాన్ తో కలిసి కాలు కదిపింది సన్నీ. కానీ తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోయిందట. షారుఖ్ కు ప్రతీ రెండు సెకన్లకూ థ్యాంక్స్ చెప్తూనే ఉందట. ఆయన నన్ను పిచ్చిదాన్ని అనుకున్నాడేమో అంటూ ఇప్పుడు ఓ ఇదైపోతోందీ భామ. ఎనభైల్లో బాలీవుడ్ ను ఊపేసిన లైలా ఓ లైలా సాంగ్ ను రయీస్ లో మళ్లీ రీమేక్ చేస్తున్నారు. ఇలాంటి ఆల్ టైం హిట్ సాంగ్ లో, బాలీవుడ్ సూపర్ స్టార్ సరసన చేయడం గురించి తలచుకుంటేనే సన్నీకి కాలూ చెయ్యీ ఆడలేదట. ఆ ఎగ్జైట్ మెంట్ లోనే షారుఖ్ కు అన్ని థ్యాంక్స్ లు చెప్పేసింది పాపం. నాతో ఇప్పటి వరకూ పెద్ద స్టార్స్ చేయలేదు. షారుఖ్ నన్ను తీసుకోవడం ద్వారా, మిగిలిన పెద్ద హీరోల సినిమాల్లో కూడా త్వరలోనే కల్పించే అవకాశం కల్పించారంటూ ఫుల్ హ్యాపీగా ఫీలైపోతోందీ సొట్టబుగ్గల సుందరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



