తమిళ హారర్ కామెడీకి సన్నీ లియోన్ గ్రీన్ సిగ్నల్!
on Apr 19, 2021
దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సన్నీ లియోన్ లేటెస్ట్గా ఓ తమిళ ఫిల్మ్‌కు సంతకం చేసింది. హారర్ కామెడీగా రూపొందే ఆ సినిమా ఈరోజే లాంఛనంగా చెన్నైలో ప్రారంభమైంది. తెలుగులో అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన 'రణం', 'ఖతర్నాక్' సినిమాలకు స్క్రీన్‌ప్లే అందించిన ఆర్. యువన్ ఈ సినిమాకు దర్శకుడు. 'సింధనై సేయ్' అనే తమిళ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అతడికి ఇది రెండో సినిమా. ఇందులో సన్నీ హీరోయిన్గా నటిస్తోంది.
ప్రస్తుతం కేరళలో ఉన్న సన్నీ ఈ సినిమా పూజా కార్యక్రమానికి హాజరు కాలేదు. త్వరలోనే ఆమె సెట్స్‌కు వస్తుందని తెలిసింది. వీఏయు మీడియా ఎంటర్టైన్మెంట్, వైట్ హార్స్ స్టూడియోస్ బ్యానర్లపై డి.వి. శక్తి, కె. శశికుమార్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి డైరెక్టర్ యువన్ మాట్లాడుతూ, "ఇదివరకే నేను 'సింధనై సేయ్' అనే తమిళ సినిమాని డైరెక్ట్ చేశాను. తెలుగు సినిమాలు 'రణం', 'ఖతర్నాక్'తో పాటు మరికొన్ని సినిమాలకు స్క్రీన్‌ప్లే సమకూర్చాను. హారర్ కామెడీ జానర్లో ఈ సినిమాని రూపొందిస్తున్నాను. ఒక చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా కథ నడవడం హైలైట్. ఈ సినిమాలోని పవర్ఫుల్ లీడ్ క్యారెక్టర్‌కు సన్నీ లియెన్ పర్ఫెక్టుగా సరిపోతారనేది నా నమ్మకం. చెన్నై, పెరంబలూర్, ముంబైలో షూటింగ్ జరుపుతాం." అని చెప్పాడు.
సతీశ్, సంజన మరో రెండు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు 'మానగరమ్' ఫేమ్ జావెద్ రియాజ్ మ్యూజిక్ అందిస్తుండగా, దీపక్ డి. మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు.
తెలుగులో ఇప్పటికే 'కరెంట్ తీగ' మూవీతో పరిచయమైన సన్నీకి తమిళంలో ఇది రెండో సినిమా. ఆమె తొలి తమిళ చిత్రం 'వీరమదేవి' చాలా కాలంగా నిర్మాణంలో ఉన్నప్పటికీ ఇంతదాకా విడుదల కాలేదు.
Also Read