హాట్ పోరి మోసం చేసింది
on Dec 8, 2013
ఇప్పుడున్న హీరోయిన్లకు పోటీగా తన అందాలతో సమాధానం చెపుతూ, హీరోయిన్ గా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్న హాట్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ హైదరాబాద్ రసిక అభిమానులను మోసం చేసింది. ఈ అమ్మడు ఎక్కడికెళ్ళినా కూడా తన అందచందాలతో అక్కడున్న వారిలో సెగలు పుట్టించకుండా ఉండదు. అలాంటి సన్నీ ఆదివారం రోజున హైదరాబాద్ వాసుల సెగలపై నీళ్ళు చల్లింది.
ఇంతకి విషయం ఏమిటంటే... నిన్న(డిసెంబర్ 8) హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ప్రమోషన్లో సన్నీ పాల్గొంది. ఈ కార్యక్రమానికి సన్నీ నిండు చుడిదార్ లో వచ్చి అక్కడున్న తన అభిమానులను నిరాశ పరిచింది. ఏ ప్రోగ్రాం లో కూడా నిండుగా బట్టలు వేసుకొని ఈ అమ్మడు ఇలా సడెన్ గా దర్శనమిచ్చేసరికి... అక్కడున్న వారందరూ కూడా నిరాశ చెందారు. పైగా ఈ అమ్మడిని ఎలాంటి స్పెషల్ ఫొటోస్ తియ్యనివ్వకుండా నిర్వాహకులు తగు జాగ్రత్తలే తీసుకున్నారు.