సుకుమార్ పై వాలిపోయిన ఎన్టీఆర్..ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుందా!
on Apr 7, 2025
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 తో పాటుప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇటీవల 'మాడ్ స్క్వేర్'సక్సెస్ మీట్ కి హాజరైన ఎన్టీఆర్ ఇదే విషయాన్నీ చెప్పుకొచ్చాడు.ఆ రెండిటి తర్వాత 'దేవర 2 'కూడా ఉంటుందని చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.తన జీవితం అభిమానులకే అంకితం అని చెప్పి అభిమానుల పట్ల తనకున్న ప్రేమ ఏ పాటిదో కూడా తెలియచేసాడు.
రీసెంట్ గా ప్రముఖ అగ్ర దర్శకుడు సుకుమార్ భార్య 'తబిత' ఇనిస్టాగ్రమ్ లో సుకుమార్ భుజాలపై ఎన్టీఆర్ ప్రేమగా వాలిపోయిన పిక్ ని షేర్ చేసింది.తారక్ కి ప్రేమతో అనే క్యాప్షన్ ని జోడించి ఎన్టీఆర్ కి ట్యాగ్ చేసింది.ఈ స్క్రీన్ షాట్ ని పంచుకున్నఎన్టీఆర్ నన్ను ఎప్పుడు వెంటాడే ఒక ఎమోషన్ అంటు సుకుమార్ ఐడి ని ట్యాగ్ చేసాడు.దీంతో ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సుకుమార్,ఎన్టీఆర్ మధ్య ఎంత అనుబంధం ఉందో ఈ ఒక్క పిక్ తో తెలిసిపోతుందంటు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుండటంతో పాటు,ఆ ఇద్దరి కాంబోలో మరోసారి సినిమా రావాలని కూడా కోరుకుంటున్నారు.
సుకుమార్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'నాన్నకుప్రేమతో' సాధించిన ఘన విజయం తెలిసిందే.2016 లో వచ్చిన ఈ మూవీ ఎన్టీఆర్ నటనలో ఉన్న మరో కోణాన్ని తెలియచెప్పడమే కాకుండా,ఎన్టీఆర్ పై ప్రేక్షకాభిమానాన్ని మరింత పెంచేలా చేసింది.'నన్ను ఎప్పుడు వెంటాడే ఒక ఎమోషన్ అంటు ఎన్టీఆర్ చేసిన క్యాప్షన్ 'నాన్నకు ప్రేమతో' మూవీలోనిదే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
