సుడిగాలి సుధీర్ కూడా మొదలెట్టాడండోయ్!!
on May 24, 2019

కమెడియన్స్ పేరు తెచ్చుకున్న సునీల్ , సప్తగిరి, షకలక శంకర్ హీరోలుగా మారి పలు చిత్రాల్లో హీరోలుగా నటించి మెప్పించారు. ఇప్పుడు మరో కమెడియన్ జబర్దస్త్ , ఢీ, పోవే పోరా వంటి టెలివిజన్ షోస్ ద్వరా ఎంతో పాపులరైన సుడిగాలి సుధీర్ హీరోగా `సాఫ్ట్ వేర్ సుధీర్` సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. ఓ నూతన నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. సుధీర్ సరసన ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రజ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే గౌతమ్ రాజు, రామ్ ప్రసాద్, రామ్ లక్ష్మణ్, భీమ్స్ సిసిరోలియో లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. సునీల్ లాంటి కమెడియన్సే హీరోలుగా నిలదొక్కుకోలేక మళ్లీ కమెడియన్స్ గా చేస్తున్నారు. మరి సుధీర్ లాంటి చిన్నపాటి కమెడియన్స్ హీరోలుగా నిలదొక్కుకోగలరా? ఉన్న ఫేమ్ ని కూడా పాడు చేసుకుంటారా? అంటున్నారా సినీ జనాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



